Bumrah vs Sam Konstas :మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారభించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతూ బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌లు బాదిన యువ ఆటగాడు కొన్‌స్టాస్, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సీనియర్ పేసర్ ఎదుట నిలవలేకపోయాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో అద్భుతమైన బంతితో కొన్‌స్టాస్‌ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు.
దీంతో బుమ్రాతోపాటు భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా అరవాలంటూ కొన్‌స్టాస్ ఫ్యాన్స్‌ను ప్రోత్సహించాడు. అదే తరహాలో కొన్‌స్టాస్ ఔటైనప్పుడు బుమ్రా కూడా అభిమానులకు సైగలు చేయడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి మీరు వీడియో చూశారా?
తొలి ఇన్నింగ్స్‌లో ఇలా
తొలి ఇన్నింగ్స్‌లో కొన్‌స్టాస్ దూకుడుగా ఆడి (60 పరుగులు, 65 బంతుల్లో) హఫ్ సెంచరీ సాధించాడు. అయితే ముఖ్యంగా కొన్‌స్టాస్ బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌లు బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టెస్టుల్లో బూమ్రా బౌలింగ్‌లో సిక్స్ రావడం 4483 బంతుల తర్వాత అదే తొలిసారి. కెరీర్లో ఆడుతున్న తొలి ఇన్నింగ్స్‌లోనే కొన్‌స్టాస్ బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ బాదడం టీమ్ఇండియా ఫ్యాన్స్‌ను నిరాశ పర్చింది.