తెలంగాణ

telangana

ETV Bharat / sports

రేటింగ్స్​లో బుమ్రా సరికొత్త రికార్డ్- తొలి బౌలర్​గా ఘనత - ICC RANKINGS

ర్యాంకింగ్స్​లో బుమ్రా ఘనత- తొలి భారత బౌలర్​గా రికార్డ్

ICC Rankings
ICC Rankings (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Jan 1, 2025, 3:09 PM IST

ICC Test Rankings :టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెరీర్​లో మరో అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో అత్యుత్తమ రేటింగ్స్ సాధించిన భారత బౌలర్​గా రికార్డ్ సృష్టించాడు. తాజా ర్యాంకింగ్స్​లో బుమ్రా 907 రేటింగ్స్​తో అగ్ర స్థానంలో ఉన్నాడు. టెస్టు ర్యాంకింగ్స్​​లో టీమ్ఇండియా బౌలర్​ సాధించిన అత్యధిక రేటింగ్స్ ఇవే. ఈ క్రమంలో మాజీ స్పిన్నర్ అశ్విన్​ను వెనక్కినెట్టేశాడు. గతంలో అశ్విన్ 904 రేటింగ్స్ సాధించాడు. 2016లో అశ్విన్‌ తన బెస్ట్‌ను నమోదు చేశాడు.

ఇక బౌలింగ్ విభాగంలో బుమ్రా తర్వాత, ఆసీస్‌ పేసర్ జోష్‌ హేజిల్‌వుడ్ (843 రేటింగ్స్​) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పాట్ కమిన్స్ (837 రేటింగ్స్​), కగిసో రబాడ (832 రేటింగ్స్​), మార్కో యాన్సెన్​ (803 రేటింగ్స్​) టాప్‌ - 5లో ఉన్నారు. సౌతాఫ్రికా పేసర్ మార్కో యాన్సెన్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు.

బ్యాటింగ్​లో ఇలా
మెల్‌బోర్న్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లో రాణించిన యువ బ్యాటర్​ యశస్వి జైస్వాల్ ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం జైస్వాల్ (854 రేటింగ్స్) నాలుగో ప్లేస్​లో కొనసాగుతున్నాడు. బాక్సింగ్‌ డే టెస్టులో తొలి సెంచరీ నమోదు చేసిన తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి (528 రేటింగ్స్) ఏకంగా 20 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం నితీశ్‌ 53వ స్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్​లో జోరూట్ (895 రేటింగ్స్​), హ్యారీ బ్రూక్ (876 రేటింగ్స్​), కేన్ విలియమ్సన్ (867 రేటింగ్స్​) టాప్- 3లో ఉన్నారు.

టీ20 ర్యాంకులను కూడా ఐసీసీ అప్డేట్ చేసింది. బ్యాటర్ల జాబితాలో టీమ్ఇండియా నుంచి తిలక్ వర్మ (806), సూర్యకుమార్ యాదవ్ (788) టాప్ 5లో ఉన్నారు. ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (855) అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌ విభాగంలో భారత్‌ నుంచి రవి బిష్ణోయ్ (666), అర్ష్‌దీప్‌ సింగ్ (656) మాత్రమే టాప్‌ -10లో ఉన్నారు. బిష్ణోయ్ 6వ స్థానం, అర్ష్‌దీప్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.

టీ20 బ్యాటర్లు

  • ట్రావిస్ హెడ్ - 855 రేటింగ్స్​
  • ఫిల్ సాల్ట్ - 829 రేటింగ్స్
  • తిలక్ వర్మ - 806 రేటింగ్స్
  • సూర్యకుమార్ యాదవ్ - 788 రేటింగ్స్
  • జోస్ బట్లర్ - 717 రేటింగ్స్

బుమ్రా బౌలింగ్​లో సిక్స్ కొట్టిన ప్లేయర్లు- ​8570 బంతుల్లో 9 సార్లే!

బుమ్రా@ 200- తొలి భారత బౌలర్​గా రికార్డ్- కెరీర్​లో మరో ఘనత

ABOUT THE AUTHOR

...view details