తెలంగాణ

telangana

ETV Bharat / sports

గాడిలో పడ్డ ఇషాన్!- ప్రాక్టీస్ షురూ- ద్రవిడ్ మాటలు వర్కౌటైనట్లే? - Ind vs eng test series 2024

Ishan Kishan Comeback Practice: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్, రీసెంట్​గా రాహుల్ ద్రవిడ్ చేసిన కామెంట్స్​ను సీరియస్​గా తీసుకున్నాడు. టీమ్ఇండియాలో స్థానం లక్ష్యంగా మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

Ishan Kishan Comeback Practice
Ishan Kishan Comeback Practice

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 10:34 AM IST

Ishan Kishan Comeback Practice:మానసిక ఒత్తిడి కారణంగా రెండు నెలలుగా టీమ్ఇండియాకు దూరంగా ఉంటున్న యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్​పై కోచ్ రాహుల్ ద్రవిడ్ రీసెంట్​గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడు జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే డొమెస్టిక్ క్రికెట్​లో ఆడాల్సి ఉంటుందని, అప్పుడే ఇషాన్​ సెలక్షన్​కు పరిగణలోకి తీసుకుంటామని రాహుల్ ఇదివరకే స్పష్టం చేశాడు. దీన్ని యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ సీరియస్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇన్నిరోజులు ఆటకు దూరంగా ఉన్న ఇషాన్, తాజాగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. జట్టులో స్థానమే లక్ష్యంగా నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బరోడా రిలయన్స్ స్టేడియంలో హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య సోదరులతో కలిసి రీసెంట్​గా ఇషాన్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. 2023 వరల్డ్​కప్​లో గాయపడ్డ స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్య రానున్న ఐపీఎల్​కు సిద్ధమవుతున్నాడు. ఈ ముగ్గురు కూడా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కిరణ్ మోరె ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మోరె తాజాగా కన్ఫార్మ్​ చేశాడు.

రాహుల్ మాటలే కారణమా?ఇంగ్లాండ్​తో రెండో టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్, ఇషాన్ విషయంపై రాహుల్ స్పందించాడు. 'ఇషాన్ కిషన్​ డొమెస్టిక్ టోర్నీలో ఆడడం స్టార్ట్ చేయాలి. అప్పుడే అతడు సెలక్షన్​లో ఛాయిస్​గా ఉంటాడు. ఇప్పటికీ సెలక్షన్ కమిటీ, మేనేజ్​మెంట్ ఇషాన్​తో టచ్​లోనే ఉంది' అని ద్రవిడ్ అన్నాడు. అయితే గతేడాది జట్టుకు దూరమైనప్పటి నుంచి ఇషాన్, ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రాక్టీస్ చేసినట్లు కనిపించలేదు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలోనూ ఇషాన్ ఆడట్లేదు. ఇక ఎట్టకేలకు ఇషాన్ గ్రౌండ్​లో అడుగుపెట్టాడు.

ఈ సిరీస్​కు కష్టమే!ఇషాన్ ప్రాక్టీస్ ప్రారంభించినప్పటికీ ఇంగ్లాండ్​తో మిగిలిన మూడు టెస్టులకు టీమ్ఇండియాలో ప్లేస్ దక్కించుకోవడం కష్టమే అని చెప్పాలి. రంజీలో ఝార్ఖండ్- హరియాణా మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్​కు కూడా ఇషాన్, ఝార్ఖండ్ తుది జట్టులో లేడు. దీంతో అతడు మిగిలిన మూడు టెస్టులకు ప్రాక్టికల్​గా దూరమైనట్లే!

ఇంగ్లాండ్​ సిరీస్​తో ఇషాన్ రీ ఎంట్రీ- హింట్ ఇచ్చిన ద్రవిడ్!

టెస్ట్ సిరీస్​ నుంచి తప్పుకున్న ఇషాన్- సౌతాఫ్రికా టూర్ నుంచి రిటర్న్

ABOUT THE AUTHOR

...view details