IPL Mega Auction 2025 :క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా మరికొద్ది సేపట్లో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో 10 ఫ్రాంచైజీల ఓనర్లు, అలాగే కోచ్‌లు ఇప్పటికే ఈవెంట్ కోసం అక్కడికి చేరుకున్నారు. ఇక భారత కాలమానం ప్రకారం ఈ ఆక్షన్ ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలక స్టార్ట్ అవ్వనుంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో సినిమా వేదికగా ఈ ఈవెంట్‌ను ఆన్లైన్లో లైవ్‌గా చూడొచ్చు. అలాగే టీవీలో చూడాలనుకునేవారు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు.
574 ప్లేయర్లు- 204 మందికే లక్కీ ఛాన్స్!
ఈ సారి జరగనున్న వేలంలో 574 మంది ప్లేయర్లు తమ లక్‌ను పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిలో 366 మంది భారతీయులు, మిగతా 208 మంది విదేశీ ప్లేయర్లే. ఇక ఈ వేలంలో మొదటి గంట అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే ఆ టైమ్‌లోనే టాప్ ప్లేయర్లందరూ వేలంలోకి రానున్నారు. సో ఆ గంటను మాత్రం క్రికెట్ లవర్స్ అస్సలు మిస్ కాకండి అంటూ క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఇక ధనాధన్ ప్లేయర్లుగా రాణిస్తున్న వారందరూ సెట్ 1, సెట్ 2 లిస్ట్‌లోకి వచ్చేశారు. అర్ష్‌దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, మిచెల్ స్టార్క్, జోస్ బట్లర్ లాంటి స్టార్ క్రికెటర్లు సెట్ 1కి చెందినవారే. ఇక సెట్ 2లో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, లియమ్ లివింగ్‌స్టోన్ లాంటి ప్లేయర్లు ఉన్నారు.
ఇదిలా ఉండగా, రూ. 2 కోట్ల అత్యధిక బేస్ ధర కేటగిరిలో 81 మంది బరిలో ఉన్నారు. అందులో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత రూ. 1.5 కోట్ల కేటగరీలో 27, రూ. 1.25 కోట్ల లిస్ట్‌లో 18, ఇక రూ.1 కోటి కేటగిరిలో 23 మంది ప్లేయర్లు ఉన్నారు.