తెలంగాణ

telangana

ETV Bharat / sports

రూ.23 కోట్ల ప్లేయర్ కాదు, రూ.1.5 కోట్ల ప్లేయరే ఆ జట్టుకు సారథి!

కొత్త కెప్టెన్‌ కోసం అన్వేషణ కొనసాగిస్తోన్న కోల్‌కతా నైట్ రైజర్స్​ జట్టు.

IPL 2025 Mega Auction 2025 KKR Captain
IPL 2025 Mega Auction 2025 KKR Captain (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Dec 2, 2024, 4:58 PM IST

IPL 2025 Mega Auction 2025 KKR Captain : ఐపీఎల్ 2025లో కెప్టెన్ల కొరత సమస్యను చాలా జట్లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు కూడా ఒకటి . గత ఐపీఎల్‌ సీజన్‌లో టీమ్​ను విజేతగా నిలబెట్టినప్పటికీ, ఏకంగా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌నే వదులుకుంది కేకేఆర్​. దీంతో ఇప్పుడు కొత్త సారథి కోసం కేకేఆర్​ అన్వేషణను ప్రారంభించింది.

అయితే ఇప్పుడు వేలంలో భారీ మొత్తానికి తిరిగి దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారని ఆ మధ్య ప్రచారం సాగింది. అయితే, సీనియర్‌ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లు తాజాగా సమాచారాం అందుతోంది.

రీసెంట్​గా జరిగిన మెగా వేలంలో కేకేఆర్​, వెంకటేశ్‌ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకు దక్కించుకుంది కేకేఆర్​. అదే సమయంలో రహానెను రూ.1.5 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. భారీ మొత్తానికి దక్కించుకున్న శ్రేయస్​ అయ్యర్‌ కన్నా, ఎంతో ఎక్స్​పీరియన్స్ ఉన్న రహానెకు ఐపీఎల్ 2025 సీజన్‌ జట్టు బాధ్యతలను అప్పగించాలని ఫ్రాంచైజీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది.

అయితే కెప్టెన్సీ విషయంలో ఇప్పటికే రహానె పలుసార్లు సత్తా చాటాడు. టీమ్‌ ఇండియాను గతంలో పలు సార్లు ముందుండి నడిపించాడు కూడా. ప్రస్తుతం రంజీ ట్రోఫీలోనూ ముంబయి జట్టు సారథిగానూ వ్యవహరిస్తున్నాడు. దీంతో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కేకేఆర్​ కెప్టెన్సీ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

"నిజమే, ప్రస్తుతానికి రహానెకు కేకేఆర్​ కొత్త కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఫ్రాంఛైజీ 90 శాతం నిర్ణయానికి వచ్చింది. సారథ్య బాధ్యతల కోసమే అతడిని ఆక్షన్​లోకి తీసుకుంది" అంటూ కేకేఆర్​ వర్గాలు చెప్పినట్లు ఓ మీడియా కథనంలో పేర్కొంది.

అంతకుముందు కెప్టెన్సీ రేసులో తానూ ఉన్నట్లు వెంకటేశ్‌ అయ్యర్‌ చెప్పిన సంగతి తెలిసిందే. "జట్టు కోసం పత్రి ఒక్కరూ ఆడేలా వాతావరణాన్ని క్రియేట్ చేయడం సారథి బాధ్యత. ఆ రెస్పాన్సిబిలిటీస్​ అప్పగిస్తే, స్వీకరించడనాకి ఎంతో ఆనందంగా ఉన్నాను" అని పేర్కొన్నాడు. నితీశ్‌ రాణా లేనప్పుడు గతంలో జట్టును పలు సార్లు ముందుండి నడిచిపించినట్లు వెల్లడించాడు.

కాగా, వచ్చే సీజన్‌కు రహానెకు పూర్తి స్థాయి సారథ్య బాధ్యతలు అప్పగించి, వెంకటేశ్‌ అయ్యర్​కు వైస్‌ కెప్టెన్సీని బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్‌ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. మరి కేకేఆర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.

క్రికెటర్ల 'అ' ఫార్ములా- కుమారులకు A సిరీస్​లోనే పేర్లు!

WTC ఫైనల్ రేస్: ఆసీస్​ సిరీస్ 2-2తో డ్రా అయినా భారత్ ఫైనల్ బెర్త్ పక్కా!- కానీ

ABOUT THE AUTHOR

...view details