IPL 2025 New Captains :IPL Mega Auction 2025 Team Captains : ఐపీఎల్ మెగా వేలం ఆదివారం, సోమవారం(24,25 తేదీత్లో) రసవత్తరంగా సాగుతోంది. మొదటి రోజే సంచలనాలు నమోదయ్యయి. రిషభ్ పంత్ అత్యధిక ధరను దక్కించుకుని, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆడగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఇప్పటికే కొన్ని జట్లకు కెప్టెన్లు ఉండగా, మరికొన్ని ఫ్రాంఛైజీలకు కొత్త కెప్టెన్లు రానున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఏ జట్టుకు ఎవరు రానున్నారో తెలుసుకుందాం.
ఏ జట్లకు ఉన్నారంటే?
చెన్నై సూపర్ కింగ్స్ -గతేడాది చెన్నై జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సారి అతడిని రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది సీఎస్కే. అతడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది! ఎంఎస్ ధోనీని కూడా అట్టిపెట్టుకున్నప్పటికీ అతడికి సారథ్య బాధ్యతలు ఇవ్వకపోవచ్చు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ -గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఫైనల్‌కు చేర్చాడు కెప్టెన్ పాట్ కమిన్స్. దారుణమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో కింద ఉన్న జట్టుకు మళ్లీ పైకి తీసుకొచ్చాడు. అందుకే ఈ సారి అతడిని రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్, అతడినే కెప్టెన్‌గా కొనసాగించనుంది. ఇదే జట్టులో హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు)కు అత్యధిక మొత్తం దక్కాయి.
ముంబయి ఇండియన్స్ -రోహిత్ శర్మను ప్లేయర్‌గా ఆడించి, అతడి కెప్టెన్సీ బాధ్యతలను గతేడాది హార్దిక్ పాండ్యకు అప్పగించింది ముంబయి యాజమాన్యం. కానీ ఆ అప్పుడు ముంబయి ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఈ సారి అతడిని పక్కనపెట్టి సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికైతే పాండ్యనే సారథి.
గుజరాత్ టైటాన్స్ - రషీద్ ఖాన్ రూ.18 కోట్లు అందుకున్నాడు.గిల్ రూ.16.50 కోట్లకే అంగీకరించాడు. ఎందుకంటే గతేడాది అతడిని కెప్టెన్సీలో గుజరాత్ మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. అయినా కూడా గిల్‌పై నమ్మకంతోనే అతడికే మరోసారి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది మేనేజ్‌మెంట్.
రాజస్థాన్ రాయల్స్ - గత కొన్ని సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్ జట్టును నడిపిస్తోన్న సంజు శాంసనే ఈ సారి కూడా జట్టును నడిపించనున్నాడు. భారత సంచలన ప్లేయర్ యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, హెట్‌మయెర్‌ను రాజస్థాన్ రిటైన్ చేసుకుంది. సంజు శాంసన్‌తో పాటు యశస్వీకి ఎక్కువ ధర దక్కింది. వీరిద్దరిని రూ.18 కోట్ల చొప్పున రిటైన్ చేసుకుంది ఆర్ఆర్.