తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2024 - 10వ స్థానంలో ఉన్న రికార్డులివే! - IPL 2024 Top 10 Number Records

IPL 2024 Top 10 Number Records : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మనదేశంలో 16ఏళ్ల క్రితం ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు ఐపీఎల్​కు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఈ లీగ్​లో ఎన్నో రికార్డులు నమోదు అయ్యాయి. అయితే ఈ సీజన్​ మార్చి 22న జరగబోయే సీఎస్కే - ఆర్సీబీ మ్యాచ్​తో షురూ కానుంది. అంటే మరో తొమ్మిది, పది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ హిస్టరీలో 10 స్థానంలో ఉన్న రికార్డులను ఓ సారి తెలుసుకుందాం.

IPL 2024 - 10వ స్థానంలో ఉన్న రికార్డులివే!
IPL 2024 - 10వ స్థానంలో ఉన్న రికార్డులివే!

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 11:19 AM IST

IPL 2024 Top 10 Number Records : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2008లో ప్రారంభమైంది. ప్రతి సీజన్​కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 16 సీజన్లలో, అనేక చారిత్రక రికార్డులు నమోదు అయ్యాయి. కొంతమంది ఆటగాళ్ళు అత్యధిక పరుగులు సాధించి రికార్డులు బద్దలు కొట్టారు. మరికొందరు ఫాస్టెస్ట్ సెంచరీని సాధించి హిస్టరీ క్రియేట్ చేశారు. అంతేకాదు కొంతమంది బౌలర్‌లు ఒకే ఓవర్‌లో వరుస సిక్సర్లు కొట్టిన ఘటనలూ ఉన్నాయి. ఇంకొంతమంది కెప్టెన్ తన జట్టును ఎక్కువ సార్లు విజేతగా నిలపడంలో కష్టపడ్డారు. అయితే ఐపీఎల్‌లో ఇప్పటికీ రికార్డులు క్రియేట్ చేయడం పాత రికార్డులను బద్దలు కొట్టడం కొనసాగుతూనే ఉంది. మరి ఐపీఎల్ చరిత్రలో పదో స్థానంలో ఉన్న​ రికార్డులేవో మనం తెలుసుకుందాం.

కె.ఎల్. రాహుల్ : లఖ్​నవూ సూపర్ జెయింట్స్​కు కెప్టెన్ అయిన కె.ఎల్. రాహుల్ 51 మ్యాచులకు కెప్టెన్​గా ఉండి 25 విజయాలను అందించాడు. ఎక్కువ మ్యాచులకు కెప్టెన్​గా వ్యవహరించిన ఆటగాళ్ల జాబితాలో అతడి స్థానం పదోది.

రవిచంద్రన్ అశ్విన్ : ఐపీఎల్​లో ఎక్కువ మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో పదో స్థానంలో ఉన్నాడు అశ్విన్. 2009 నుంచి ఆడుతున్నాడాతడు. 197 మ్యాచులు ఆడి ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు. 171 వికెట్ల తీశాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపును ఆడుతున్నాడు.

గుజరాత్ టైటాన్స్ : ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్ విభాగంలో గుజరాత్ టైటాన్స్ పదో స్థానంలో ఉంది. 2023 సీజన్​లో గుజరాత్​ ఈ ఘనత సాధించింది. గతేడాది ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచులో గుజరాత్ 233 పరుగుల స్కోర్​ను నమోదు చేసింది.

యశస్వి జైశ్వాల్ : తనదైన స్టైల్లో ఆడుతూ జట్టుకు ఎన్నో విజయాలను అందిస్తున్నాడు యశస్వి జైశ్వాల్. రాజస్థాన్ రాయల్స్ తరపును ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఐపీఎల్​లో ఎక్కువ స్ట్రైక్​ రేట్ కలిగి ఉన్నాడు. దాదాపు 148 స్ట్రైక్ రేట్​తో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. కేవలం 37 ఇన్నింగ్స్​లో యశస్వి ఈ ఘనత సాధించాడు.

గిల్ క్రిస్ట్ : అత్యధిక వికెట్లు తీసిన వికెట్ కీపర్​గా గిల్ క్రిస్ట్ పదో స్థానంలో కొనసాగుతున్నాడు. పంజాబ్, డెక్కన్ ఛార్జర్స్ తరపున బరిలో దిగి 80 ఇన్నింగ్స్​లో 67 మందిని పెవిలియన్​కు పంపాడు. 2008 నుంచి 2013వరకు ఆడిన ఈ ఆటగాడు 51 క్యాచులు, 16 స్టింపింగ్​లు చేసి సంచలనం క్రియేట్ చేశాడు.

మురళీ విజయ్ : అత్యధిక వ్యక్తిగత స్కోర్ విభాగంలో పదో స్ధానంలో ఉన్నాడు మురళీ. 2010 సీజన్​లో 56 బంతుల్లో 127 పరుగులు సాధించి అదరగొట్టాడు. ఇందులో 11 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి.

హర్బజన్ సింగ్ : ఐపీఎల్ అత్యధిక వికెట్లు తీసినవారి జాబితాలో హర్బజన్ సింగ్ పదో స్థానంలో కొనసాగుతున్నాడు. ముంబయి ఇండియన్స్, చెన్నై తరపున ఎక్కువ మ్యాచులు ఆడాడు. 150 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడీ మాజీ ఆఫ్ స్పిన్నర్.

హషీమ్ ఆమ్లా : ఐపీఎల్ అత్యధిక సెంచరీలు సాధించిన విభాగంలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ పదో స్థానంలో ఉన్నాడు. తన ఐపీఎల్ కెరీర్​లో 2 సెంచరీలు చేశాడు. కింగ్స్ లెవన్ పంజాబ్ తరపున 2016,2017లో ఆడిన ఆమ్లా ఈ ఘనతను సాధించాడు. ఒకే సీజన్​లో ఆడి రెండు సెంచరీలను నమోదు చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ : ఐపీఎల్ అనగానే చెన్నైసూపర్ కింగ్స్ గుర్తుకు వస్తుంది. ఐపీఎల్ ఎన్ని రికార్డులు నమోదు అయినా సీఎస్ కే సాధించిన ఈ రికార్డ్ మాత్రం స్పెషల్​గానే ఉంటుంది. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై జట్టు రికార్డు స్థాయిలో పది సార్లు ఫైనల్ వరకు వెళ్లింది. 5 సార్లు టైటిల్​ను కైవసం చేసుకుంది.

IPL 2024 లఖ్​నవూ - ఇంకో రెండు అడుగులు ముందుకు వేస్తదా?

IPL 2024 ఈ సారైనా పంజాబ్ తలరాతమారేనా?

ABOUT THE AUTHOR

...view details