తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2024 గెట్‌ రెడీ ఆరెంజ్‌ ఆర్మీ - హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే? - IPL 2024 Sunrisers Hyderabad

IPL 2024 Sunrisers Hyderabad : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) - 2024 మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తాజా సీజన్ కోసం కీలక మార్పులతో ఆరెంజ్​ ఆర్మీ బరిలోకి దిగబోతుంది. ఈ సందర్భంగా జట్టు కూర్పుతో పాటు సన్​రైజర్స్ ఆడబోయే మ్యాచ్ వివరాలను తెలుసుకుందాం.

IPL 2024 సన్​రైజర్స్​
IPL 2024 సన్​రైజర్స్​

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 1:54 PM IST

Updated : Mar 13, 2024, 3:22 PM IST

IPL 2024 Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) - 2024 మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లన్నీ తమ ఫ్రాంచైజీకి చెందిన కాంపౌండ్లకు చేరుకుని ప్రాక్టీస్​ సెషన్లను ప్రారంభించేశాయి. అయితే ఈ ఐపీఎల్ బరిలో దిగే జట్లతో సన్​ రైజర్స్​ హైదరాబాద్ కూడా ఒకటి. పేరుకు తెలుగు జట్టే అయినా అంతా విదేశీ ఆటగాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే ట్రోఫిని ముద్దాడిందీ జట్టు. అయితే ఈ జట్టు తలరాత మారాలని, కావ్య పాప మొహంలో ఆనందం చూడాలని ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఆశిస్తూనే ఉన్నారు. కానీ ఈ జట్టు మాత్రం ఉసూరుమనిపిస్తూనే ఉంది. అయితే తాజాగా సీజన్ కోసం కీలక మార్పులతో ఆరెంజ్​ ఆర్మీ బరిలోకి దిగబోతుంది. కొత్త కెప్టెన్‌ ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్‌ సారథ్యంలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ సందర్భంగా జట్టు కూర్పుతో పాటు సన్​రైజర్స్ ఆడబోయే మ్యాచ్ వివరాలను తెలుసుకుందాం.

కొత్త కెప్టెన్ ఏం చేస్తాడో : గత కొన్ని సీజన్లుగా అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్న జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్​. ఐపీఎల్ 2023లోనూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిపోయింది. అంతకు ముందు రెండు సీజన్లలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈ సారి జట్టుకు కొత్త కెప్టెన్‌ వచ్చిన సంగతి తెలిసిందే. మినీ వేలంలో ఆసీస్ స్టార్ ప్లేయర్ పాట్‌ కమిన్స్‌ను రూ.20.50 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసింది. జట్టు సారథ్య బాధ్యతలను అతడికే అప్పగించింది. ఐపీఎల్‌ వేలం చరిత్రలోనే ఇది రెండో అత్యధిక కొనుగోలు కావడం విశేషం.

వన్డే వరల్డ్ కప్​లో ఆసీస్​ను విజేతగా నిలిపిన కమిన్స్‌ - సన్‌రైజర్స్‌ తల రాతా కూడా మార్చుతాడని అంతా ఆశిస్తున్నారు. గతంలో డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో 2016లో ఆరెంజ్ ఆర్మీ విజేతగా నిలిచింది. ఆ తర్వాత నుంచి కెప్టెన్లు, జెర్సీలు మారాయే తప్ప జట్టుకు టైటిల్‌ మాత్రం రాలేదు. అయితే ప్రపంచకప్​లో తమ జట్టును విజేతగా నిలబెట్టిన కమిన్స్​ ఆటతీరు టీ20ల్లో ఆశాజనకంగా లేదు. చూడాలి మరి ఈ కొత్త కెప్టెన్ ఏం చేస్తాడో.

ఓపెనర్లుగా ట్రావిడ్ హెడ్, అభిషేక్ శర్మ : ఈ కొత్త సీజన్ కోసం ఆరెంజ్ తమ జట్టు కూర్పును కూడా మార్చనుంది. ఓపెనర్‌గా ఆసీస్ స్టార్ ప్లేయర్​ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగొచ్చు. అతడికి జోడీగా అభిషేక్ శర్మను పంపే ఛాన్స్ ఉంది. దేశవాళీ క్రికెట్‌లో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. కాబట్టి ఓపెనర్​గా అతడివైపే మొగ్గు చూపొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మూడో స్థానానికి ఆ ఇద్దరిలో ఎవరో : నెం.3వ స్థానం కోసం మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి మధ్య గట్టిపోటీ ఉందని తెలుస్తోంది. కానీ టీమ్​ మేనేజ్‌మెంట్ త్రిపాఠికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మిడిలార్డర్​లో ఎవరంటే? : నాలుగో స్థానంలో దక్షిణాఫ్రికా హార్డ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ నాలుగో స్థానంలో దిగే ఛాన్స్ ఉంది. ఐదో స్థానం కోసం షహబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్ మధ్య పోటీ ఉంది. వీరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తర్వాత స్థానంలో పాట్ కమిన్స్ బ్యాటింగ్‌కు దిగొచ్చు. ఆ తర్వాత మార్కో జాన్సన్​ లేదా శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగాలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. ఇక బౌలింగ్​లో భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్ బరిలో నిలిచే ఛాన్స్​ ఉంది. టి నటరాజన్‌ను ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవచ్చి తెలుస్తోంది.

సన్​ రైజర్స్ తొలి ధపాలో ఆడే మ్యాచ్ టైమింగ్ వివరాలు :

మ్యాచ్ తేదీ టైమ్ ఎవరితో ఎక్కడ
1 మార్చి 23 7.30 PM కోల్​కతా నైట్​రైడర్స్ కోల్​కతా
2 మార్చి 27 7.30 PM మంబయి ఇండియన్స్ హైదరాబాద్
3 మార్చి 31 3.30 PM గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్
4 ఏప్రిల్ 05 7.30 PM చెన్నై సూపర్ కింగ్స్​ హైదరాబాద్

జట్టు : ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, ఐదెన్ మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్‌, మయాంక్‌ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, అన్మోల్‌ప్రీత్‌ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీశ్ కుమార్‌ రెడ్డి, అభిషేక్ శర్మ, మార్కో జాన్‌సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్‌ సింగ్, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హక్‌ ఫారూఖి, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్‌ మార్కండే, ట్రావిస్‌ హెడ్, వనిందు హసరంగ, జయ్‌దేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్, సుబ్రమన్యన్‌

IPL 2024 - 10వ స్థానంలో ఉన్న రికార్డులివే!

IPL 2024 లఖ్​నవూ - ఇంకో రెండు అడుగులు ముందుకు వేస్తదా?

Last Updated : Mar 13, 2024, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details