IPL 2024 Schedule:2024 ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుందని లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. లోక్సభ ఎన్నికలు ఉన్నప్పటికీ పూర్తి టోర్నమెంట్ను భారత్లోనే నిర్వహిస్తామని ధుమాల్ స్పష్టం చేశారు. అయితే మొదటగా తొలి రెండు వారాల షెడ్యూల్ మాత్రమే ప్రకటించి, సాధారణ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ ఖరారు చేస్తామని ఆయన అన్నారు.
'మార్చి 22న చెన్నై చిదంబరం స్టేడియంలో టోర్నీని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. ఎన్నికల తేదీలు ఖరారు అయ్యాక పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తాం. తేదీల విషయంలో మేం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. పూర్తి టోర్నమెంట్ భారత్లోనే జరుగుతుంది' అని ధుమాల్ అన్నారు. కాగా, ప్లేఆఫ్స్ కలుపుకొని టోర్నీలో మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి.
గతంలో విదేశాల్లో: అయితే ఐపీఎల్ ప్రారంభమయ్యాక ఇప్పటిదాకా దేశంలో 3 సాధారణ ఎన్నికలు జరిగాయి. సెక్యురిటీ కారణాల వల్ల అందులో 2009 ఎడిషన్ పూర్తి టోర్నమెంట్ను బీసీసీఐ సౌతాఫ్రికాలో నిర్వహించింది. ఆ తర్వాత 2014ఎడిషన్లో తొలి 20 మ్యాచ్లను బీసీసీఐ యూఏఈ (దుబాయ్)లో జరిపింది. ఇక ఎన్నికల తర్వాత టోర్నీని మళ్లీ భారత్కు షిఫ్ట్ చేసింది. కానీ, 2019లో మాత్రం పూర్తి టోర్నీని సక్సెస్ఫుల్గా భారత్లోనే నిర్వహించింది.