IPL 2024 Schedule:2024 ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న లీగ్ ప్రారంభంకానుంది. చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో బోర్డు తొలుత 21 మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వరకు ఐపీఎల్ 17న సీజన్ తొలి విడత టోర్నీ జరగనుంది. ఇందులో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్లు ఉన్నాయి. ఇక మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ సాధారణ ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత ప్రకటించే ఛాన్స్ ఉంది.
అయితే భారత్లో ఏప్రిల్- మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. అయినప్పటికీ ఈసారి టోర్నమెంట్ను పూర్తిగా భారత్లోనే నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఐపీఎల్ లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఇదివరకే స్పష్టం చేశారు. ఇక ఈ ఎడిషన్లో ప్లేఆఫ్స్ కలుపుకొని మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. అందులో 21 మ్యాచ్ల షెడ్యూల్ గురువారం రిలీజైంది.
ఏయే మ్యాచ్లు ఎప్పుడంటే?
- మార్చి 22: చెన్నై X బెంగళూరు (చెన్నై)
- మార్చి 23: పంజాబ్ X దిల్లీ (మొహాలీ)
- మార్చి 23: కోల్‌కతా X హైదరాబాద్ (కోల్‌కతా)
- మార్చి 24: రాజస్థాన్ X లఖ్‌నవూ (జైపుర్)
- మార్చి 24: గుజరాత్ X ముంబయి (అహ్మదాబాద్)
- మార్చి 25: బెంగళూరు X పంజాబ్ (బెంగళూరు)
- మార్చి 26: చెన్నై X గుజరాత్ (చెన్నై)
- మార్చి 27: హైదరాబాద్ X ముంబయి (హైదరాబాద్)
- మార్చి 28: రాజస్థాన్ X దిల్లీ (జైపుర్)
- మార్చి 29: బెంగళూరు X కోల్‌కతా (బెంగళూరు)
- మార్చి 30: లఖ్‌నవూ X పంజాబ్ (లఖ్‌నవూ)
- మార్చి 31: గుజరాత్ X హైదరాబాద్ (అహ్మదాబాద్)
- మార్చి 31: దిల్లీ X చెన్నై (వైజాగ్)
- ఏప్రిల్ 01: ముంబయి X రాజస్థాన్ (ముంబయి)
- ఏప్రిల్ 02: బెంగళూరు X లఖ్‌నవూ (బెంగళూరు)
- ఏప్రిల్ 03: దిల్లీ X కోల్‌కతా (వైజాగ్)
- ఏప్రిల్ 04: గుజరాత్ X పంజాబ్ (అహ్మదాబాద్)
- ఏప్రిల్ 05: హైదరాబాద్ X చెన్నై (హైదరాబాద్)
- ఏప్రిల్ 6: రాజస్థాన్ X బెంగళూరు (జైపుర్)
- ఏప్రిల్ 7: ముంబయి X దిల్లీ (ముంబయి)
- ఏప్రిల్ 7: లఖ్‌నవూ X గుజరాత్ (లఖ్‌నవూ)