IPL 2024 Play Offs :దాదాపు రెండు నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నాలుగు జట్లు నాకౌట్ దశకు చేరుకోవడంతో ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు వేళైంది. రెండు జట్లు కాస్త ఈజీగానే బెర్త్‌లు కన్ఫామ్ చేసుకున్నా మరో రెండు మాత్రం సంచలన ప్రదర్శనతో మిగతా రెండు స్థానాలను దక్కించుకున్నాయి. మరి ఈ రెండు నెలల పాటు ఎవరి ప్రయాణం ఎలా కొనసాగిందో చూద్దాం.
అంచనాలు లేకుండా అగ్రస్థానానికి - టోర్నీ మొదలు అవ్వకముందు కోల్‌కతా టాప్ - 4కు దూసుకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ టోర్నీలో సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, ఆండ్రి రస్సెల్ విధ్వంసం, బౌలింగ్‌లో కుర్రాళ్లు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి వంటి వారు రాణించడం వల్ల కోల్‌కతా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 9 విజయాలు నమోదు చేసింది. 20 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. రెండు మ్యాచులు మాత్రం వర్షం కారణంగా రద్దయ్యాయి.
ఊహించని విధంగా ప్రదర్శన - గత సీజన్లలో పేలవ ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ ఈ సారి మాత్రం అనూహ్యంగా అద్భుత ప్రదర్శన చేసి ప్లేఆఫ్స్‌కు చేరింది. ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్స్, క్లాసెన్ హిట్టింగ్, నితీశ్‌రెడ్డి ఆల్‌రౌండ్ ఇన్నింగ్స్, అబ్దుల్ ఫినిషింగ్ వల్ల 14 మ్యాచుల్లో 8 విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్ రద్దు వల్ల 17 పాయింట్లను దక్కించుకుంది. అలానే ఐపీఎల్‌లోనే అత్యధిక స్కోరు (287) సాధించిన జట్టుగానూ రికార్డుకెక్కింది.
తొలి 9 మ్యాచుల్లో ఎనిమిది విజయాలు - ఎప్పుడూ వరుసగా మూడు, నాలుగు మ్యాచులు గెలిచి ఢీలా పడిపోయే రాజస్థాన్ ఈ సారి ఏకంగా మొదటి తొమ్మిది మ్యాచుల్లో 8 విజయాలు సాధించింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా మళ్లీ ఆఖరి ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో పరాజయం అందుకుంది. ఒక మ్యాచ్ రద్దైంది. ఫస్ట్ హాఫ్‌లో ఆధిపత్యం చూపించిన ఆ జట్టులో బ్యాటర్లు, బౌలర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.