IPL 2024 Mumbai Indians :ఐపీఎల్ 2024కు కోసం సర్వం సిద్ధమైంది. మరో రోజులో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఇప్పటికే అన్నీ జట్ల ఆటగాళ్లు తమ కాంపౌండ్‌కు చేరుకుని ప్రాక్టీస్ చేయడం ఎప్పుడో ప్రారంభించారు. అయితే ఈ సీజన్లో ఎక్కువగా చర్చల్లో నిలిచిన జట్టు ముంబయి అనే చెప్పాలి. అందుకు కారణం కెప్టెన్సీ మార్పు. ఐదుసార్లు జట్టుకు టైటిల్ అందించిన రోహిత్ శర్మను పక్కనుపెట్టి హార్దిక్ పాండ్యకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఓ దశలో పాండ్య కెప్టెన్సీలో రోహిత్ ఆడతాడా? అన్న అనుమానాలూ కూడా వచ్చాయి. అయితే తాజాగా వీరిద్దరూ తొలిసారి మైదానంలో ఎదురుపడ్డారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే?
రోహిత్, పాండ్యా భేటీలో ఏం జరిగింది?
ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం జట్టు శిబిరంలో చేరాడు. ఆ సమయంలో ప్రాక్టిస్ కూడా చేశాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య జరిగిన భేటీకి సంబంధించిన వీడియోను ముంబయి ఇండియన్స్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఒక ప్రత్యేక విషయం గమనించవచ్చు. నిజానికి, మైదానంలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య ఒకరినొకరు చూసిన వెంటనే, పాండ్య రోహిత్ వైపు కదిలాడు. రోహిత్ శర్మ అతనితో కరచాలనం చేయడానికి చేయి చాచాడు. కానీ రోహిత్‌తో కరచాలనం చేయడానికి బదులుగా, హార్దిక్ పాండ్యను కౌగిలించుకున్నాడు. ఈ వీడియోను పోస్ట్ చేసి ముంబయి ఇండియన్స్ తమ క్యాప్షన్‌లో 45, 33 అని రాశారు. 45 రోహిత్ శర్మ జెర్సీ నంబర్ కాగా, 33 హార్దిక్ పాండ్యాది.