తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 7:52 AM IST

ETV Bharat / sports

6, 6, 6, 4, 4, 6 - అరంగేట్రంలోనే అదరగొట్టేసిన జేక్ ఫ్రేజర్ ఎవరంటే? - IPL 2024 Lucknow Super Giants VS DC

IPL 2024 Lucknow Super Giants VS DC Jake Fraser : ఆస్ట్రేలియా యువ సంచలనం, దిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ - మెక్‌గుర్క్ తన ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టేశాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చిన అతడు తన ఆట తీరుతో క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. అతడి గురించే ఈ కథనం.

Etv Bharat
Etv Bharat

IPL 2024 Lucknow Super Giants VS DC Jake Fraser :వ‌రుస ఓటముల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో నిలిచిన దిల్లీ క్యాపిటల్స్​ ఐపీఎల్ 2024 సీజ‌న్​లో ఎట్టకేలకు రెండో విజ‌యాన్ని అందుకుంది. అయితే ఈ విజయంలో కెప్టెన్ పంత్​తో పాటు అరంగేట్రం యంగ్​ ప్లేయ‌ర్ జేక్ ఫ్రేజర్ - మెక్‌గుర్క్ కూడా కీలకంగా వ్యవహరించాడు. వికెట్లు ప‌డిపోతున్న క్ర‌మంలో వార్నర్‌ ఔట్ అయ్యాక క్రీజులోకి వ‌చ్చిన జేక్ వచ్చీరాగానే లఖ్​నవూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతినే అద్భుతమైన సిక్సర్​గా మలిచాడు. ముఖ్యంగా స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్యాను అయితే ఓ ఆట ఆడేసుకున్నాడు. 13 ఓవర్‌ వేసిన పాండ్యా బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాదిన ఇతడు మొత్తంగా 35 బంతుల్లో 2 ఫోర్లు ,5 సిక్స్‌లతో 55 పరుగులు సాధించాడు. దీంతో ఎవరీ జేక్ ఫ్రేజర్ - మెక్‌గుర్క్ అని క్రికెట్ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్?

జేక్ ఫ్రేజర్ వయసు 22 ఏళ్లు. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో 2002 ఏప్రిల్‌ 11న జన్మించాడు. ధ‌నాధ‌న్ భారీ హిట్టింగ్​కు కేరాఫ్ అడ్రెస్​గా మారుతున్నాడు. 2019లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టి విక్టోరియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అదే ఏడాది లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ అడుగుపెట్టి అదరగొట్టడంతో బిగ్‌బాష్‌లో లీగ్​కు ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చింది.

బిగ్‌బాష్‌ లీగ్‌ 2020 సీజన్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేసిన జేక్ ఇప్పటివరకు తన 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 645 రన్స్ సాధించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 550 పరుగులు, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 525 రన్స్ చేసి తన ఖాతాలో వేసుకున్నాడు.

గతేడాదిలో లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు కూడా అందుకున్నాడు. ఆస్ట్రేలియా దేశీవాళీ వన్డే టోర్నీలోనూ కేవలం 29 బంతుల్లోనే శతకం బాది రికార్డుకెక్కాడు. దీంతో లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్‌ సెంచరీ చేసిన ప్లేయర్​గా నిలిచాడు. 2020లో జరిగిన అండర్-19 వరల్డ్ క‌ప్​లోనూ బరిలోకి దిగాడు. ఈ ఏడాది అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేశాడు. వెస్టిండీస్​తో జరిగిన వన్డే సిరీస్​తో ఎంట్రీ ఇచ్చాడు. ఆడిన రెండు మ్యాచుల్లో 51 పరుగులు చేశాడు.

ఈ క్రమంలోనే ఐపీఎల్‌-2024 వేలంలో రూ. 50 లక్షల కనీస ధరతో బరిలోకి దిగాడు. కానీ అతడిని ఎవరు కొనుగోలు చేయలేదు. అయితే ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌ పర్సనల్ రీజన్స్​తో ఈ సీజన్​ నుంచి తప్పుకోవడం వల్ల అతడికి ఆడే ఛాన్స్ దక్కింది.

కొత్త కుర్రాడి మెరుపులు - లఖ్​నవూపై దిల్లీ విజయం - LSG vs DC IPL 2024

ఆ రెండూ నా టార్గెట్!- అప్పటిదాకా నో రిటైర్మెంట్!- ​రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - Rohit Sharma Retirement

ABOUT THE AUTHOR

...view details