BCCI Apex Meeting : ఐసీసీ ఛైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జైషా ఎన్నిక కావడం వల్ల ఆయన స్థానంలో కొత్త కార్యదర్శి నియామకం తప్పనిసరి కానుంది. అయితే ఈ సారి జరగనున్న అపెక్స్ మీటింగ్‌లో ఈ విషయంపై చర్చలు జరిగే అవకాశాలు లేనట్లు ఉందని క్రికెట్ వర్గాల మాట. అంతేకాకుండా ఈ సమావేశంలో ఐపీఎల్ రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ రూల్స్ గురించి కూడా చర్చకు రాకపోవచ్చని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఐసీసీ ఛైర్మన్‌గా జైషా డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే మరికొద్ది రోజుల్లోనే బెంగళూరులో 93వ సాధారణ సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించనుంది. అంతలోపు ఈ అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగాలి. ఇక ఏజీఎం వరకు జైషానే సెక్రట్రీగా కొనసాగనున్నారు. దీంతో ఇప్పటికిప్పుడు బీసీసీఐ కొత్త సెక్రట్రీ నియామకంపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని విశ్లేషకుల అభిప్రాయం.
బైజూస్ సెటిల్‌మెంట్ వెరీ ఇంపార్టెంట్
అయితే ఈ అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఎనిమిది కీలక అంశాలపై చర్చ జరగనుందని సమాచారం. అందులో బైజూస్‌కు సంబంధించి పేమెంట్‌ను సెటిల్ చేసుకోవడం అతి ముఖ్యమైనదని తెలుస్తోంది. 2019 మార్చిలో బైజూస్‌తో బీసీసీఐ ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ఓ ఏడాది వరకూ దాన్ని రెన్యూవల్ చేసింది. అయితే బైజూస్ మాత్రం 2022 సెప్టెంబర్ వరకే దీనికి పేమెంట్ చేసింది. దీంతో బైజూస్‌తో బీసీసీఐ స్పాన్సర్‌షిప్ అగ్రిమెంట్ గతేడాది మార్చితోనే ముగిసింది. అయితే 2022 అక్టోబర్ నుంచి 2023 మార్చి వరకు ఉన్న బాకీలను వసూలు చేసేందుకు ఏం చేయాలనే దానిపై ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు టాక్. వీటితో పాటు బెంగళూరులో కొత్తగా నిర్మించిన జాతీయ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంపైనా, ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం రిన్నోవేషన్‌పైనా కూడా ఈ మీటింగ్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఏకగ్రీవ ఎన్నిక
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ అత్యన్నత పదవికి జై షా మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ పదవికి కేవలం ఒక్క జై షా నామినేషనే దాఖలైంది. దీంతో ఎలాంటి ఎన్నిక లేకుండానే జై షా క్రికెట్ అత్యున్నత బోర్డుకు ఛైర్మన్ అయ్యారు. 2024 డిసెంబర్ 1న జై షా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్లపాటు జై షా ఆ పదవిలో కొనసాగుతారు.
జై షా నెట్‌వర్త్- ICC కొత్త ఛైర్మన్ ఆస్తులు ఎంతో తెలుసా? - Jay Shah Net Worth