ETV Bharat / sports

పారా షట్లర్లకు నజరానా - రూ.50 లక్షల రివార్డు ప్రకటించిన BAI - BAI Paralympics Cash Rewards - BAI PARALYMPICS CASH REWARDS

BAI Paralympics Cash Rewards : ఇటీవలె జరిగిన పారాలింపిక్స్​లో పతకాలు సాధించిన పారా షట్లర్లకు బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (BAI) భారీ నజరానా ప్రకటించింది. ఇందులో భాగంగా ఐదుగురు విజేతలకు కలిపి రూ.50 లక్షల నగదు పురస్కారాన్ని అందించనున్నట్లు తెలిపింది.

BAI Paralympics Cash Rewards
BAI Paralympics Cash Rewards (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 24, 2024, 5:53 PM IST

BAI Paralympics Cash Rewards : పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్​లో సత్తా చాటిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్ల కోసం బ్యాడ్మింటన్‌ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) నజరానా ప్రకటించింది. ఇందులో భాగంగా ఐదుగురు షట్లర్లకు కలిపి రూ.50 లక్షల నగదు పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని బాయ్ అధ్యక్షుడు, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తాజాగా ప్రకటించారు.

బ్యాడ్మింటన్​లో ఐదు పతకాలు
కాగా, పారిస్ పారాలింపిక్స్​లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్​కు ఐదు పతకాలు దక్కాయి. అందులో ఒకటి స్వర్ణం కాగా, చెరో రెండు రజత, కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్ SL 3 విభాగంలో నితేశ్ కుమార్ స్వర్ణాన్ని సాధించాడు. మరో షట్లర్ సుహాస్ యతిరాజ్ రజతాన్ని ముద్దాడాడు. మహిళల సింగిల్స్ SU 5లో తులసిమతి మురుగేశన్ రజతం, మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సాధించారు. కాగా, SH 6 విభాగంలో నిత్య శ్రీ శివన్ కాంస్యం సాధించింది. ఈ షట్లర్లలో నిత్య శ్రీ శివన్, తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్ పారాలింపిక్స్​లో పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా షట్లర్లుగా చరిత్ర సృష్టించారు.

అయితే బ్యాడ్మింటన్ అసోషియేషన్ ప్రకటించిన ఈ నజరానాలో గోల్డ్ గెలిచిన నితేశ్​కు రూ.15 లక్షలు దక్కనున్నాయి. రజత పతక విజేతలైన సుహాస్, తులసిమతికి చెరో రూ. 10 లక్షలు అందనున్నాయి. ఇక కాంస్య పతక విజేతలు చెరో రూ.7.5 లక్షలు దక్కనున్నాయి. కాగా, పారాలింపిక్స్

భారత్ అదుర్స్
కాగా, పారిస్ వేదికగా ఆగస్టు 28న మొదలైన పారాలింపిక్స్‌ గేమ్స్ సెప్టెంబరు 8తో ముగిశాయి. మొత్తం 84 మంది భారత అథ్లెట్లు పారిస్ పారాలింపిక్స్ బరిలో నిలిచి, 29 పతకాలను సాధించారు. అందులో ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ అత్యధిక పతకాలు సాధించడం ఇదే తొలిసారి. అయితే బ్యాడ్మింటన్​లో భారత్​కు ఐదు పతకాల దక్కాయి. ఆ విజేతలకే BAI తాజాగా ఈ నజరానా ప్రకటించింది.

సుహాస్ యతిరాజ్: ఈ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్​ బ్యాక్​గ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే! - Suhas Yathiraj Paralympics 2024

పుట్టుకతో వైకల్యం, చేతులు లేకున్నా చెదరని సంకల్పం! - పారా ఆర్చర్ శీతల్ దేవీ గురించి తెలుసా? - Sheetal Devi Paralympics 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.