IPL 2024 Lucknow Super Giants vs Mumbai Indians :ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 రన్స్ చేసింది.
మార్కస్ స్టాయినిస్(45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 62 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్(22 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 28 పరుగులు), దీపక్ హుడా(18 బంతుల్లో 18 పరుగులు), నికోలస్ పూరన్(14 నాటౌట్), అస్టన్ టర్నర్(5), కృనాల్ పాండ్య(1 నాటౌట్) స్కోర్ చేశారు. హార్దిక్ పాండ్య 2, గెరాల్డ్, నువాన్ తుష్రా, మహ్మద్ నబి తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బౌలర్లు ముంబయి ఇండియన్స్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (32), నేహల్ వధేరా (46), టిమ్ డేవిడ్ (35 నాటౌట్) మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ (4), సూర్యకుమార్ (10), తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్యా (0), మొహమ్మద్ నబీ (1) ఫెయిల్ అయ్యారు. లఖ్‌నవూ బౌలర్లలో మొహిసిన్ ఖాన్ 2 వికెట్లు తీయగా స్టోయినిస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.