తెలంగాణ

telangana

ETV Bharat / sports

లఖ్​నవూకు బ్యాడ్‌న్యూస్‌ - రెండు మ్యాచ్‌లకు స్పీడ్​గన్​ దూరం? - IPL 2024 Mayank Yadav - IPL 2024 MAYANK YADAV

IPL 2024 Mayank Yadav : లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. యంగ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌ సేవలు రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. ఇంతకీ మయాంక్‌ ఎప్పుడు తిరిగొస్తాడంటే?

Mayank Yadav
Mayank Yadav

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 7:27 PM IST

IPL 2024 Mayank Yadav :ప్రపంచంలోని టాప్‌ స్పోర్ట్స్‌ లీగ్‌లలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) ఒకటి. క్రికెట్‌ ప్లేయర్‌ల ప్రతిభకు తగిన డబ్బు, అవకాశాలు ఇస్తుండటంతోనే ఐపీఎల్ ఇంత క్రేజ్‌ సంపాదించింది. ఐపీఎల్‌ ప్రతి సీజన్‌లో న్యూ ట్యాలెంట్‌ బయటకు వస్తుంది. కానీ ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే ఫాస్ట్‌ బౌలర్‌ చుట్టూ చర్చలు నడిచాయి. మూడేళ్ల క్రితం ఉమ్రాన్ మాలిక్, ఇప్పుడు మయాంక్ యాదవ్ తమ వేగంతో ఆకట్టుకున్నారు. ఐపీఎల్ 2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG) తరఫున మయాంక్‌ అదరగొడుతున్నాడు. అయితే ఇటీవల మయాంక్‌ గాయపడటం ఎల్ఎస్‌జీలో ఆందోళన కలిగిస్తోంది.

రెండు మ్యాచ్‌లకు మయాంక్‌ దూరం?
ఏప్రిల్‌ 7న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్‌ సైడ్ స్ట్రెయిన్ కారణంగా ఫీల్డ్‌ నుంచి వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో మయాంక్‌ కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే బౌలింగ్‌ చేశాడు. అనంతరం మైదానాన్ని వీడాడు. దీంతో అతడు తర్వాతి మ్యాచ్​లకు అందుబాటులో ఉంటాడా లేదా అన్న దానిపై అభిమానుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం మయాంక్ యాదవ్ LSG ఆడనున్న తర్వాత రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అతడు ఏప్రిల్ 19న జరిగే మ్యాచ్‌కు తిరిగి అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. అంతకుముందు నొప్పితో మయాంక్ మైదానాన్ని వీడిన తర్వాత కృనాల్ పాండ్య మాట్లాడుతూ మయాంక్‌ గాయం తీవ్రమైంది కాదు. అతని బానే ఉన్నాడు. రానున్న మ్యాచ్‌లకు దూరమవడని భావిస్తున్నాం. ఇది మాకు సానుకూల వార్త. అని పేర్కొన్నాడు. కాగా, లఖ్​నవూ ఏప్రిల్‌ 12 దిల్లీ క్యాపిటల్స్​తో, ఏప్రిల్‌ 14 కోల్‌కతా నైట్‌ రైడర్స్​తో తలపడనుంది.

మయాంక్‌ అరంగేట్రం సంచలనం
మార్చి 30న పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్‌ అరంగేట్రం చేశాడు. 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి, 3 తీశాడు. ఈ మ్యాచ్‌లో 155.8 km/h (96 mph) వేగంతో ఓ బాల్‌ను డెలివరీ చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఏప్రిల్‌ 2న ఆర్సీబీ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 156.7 km/h (96 mph) వేగంతో బౌలింగ్‌ చేసి తన రికార్డును అధిగమించాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యంత వేగవంతమైన బాల్‌ కావడం గమనార్హం. తొలి రెండు మ్యాచ్‌లలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న మొదటి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

టీ20 జట్టులో చోటు
ఐపీఎల్ 2024లో మయాంక్ ప్రదర్శనను ఇయాన్ బిషప్ ట్విట్టర్‌లో ప్రశంసించాడు. మయాంక్‌కు ఇండియా తరఫున టీ20 వరల్డ్‌ కప్‌ ఆడే సత్తా ఉందని అభిప్రాయపడ్డాడు. అలానే ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్‌ ఫాస్ట్‌ బౌలర్‌గా గుర్తింపు పొందిన డేల్‌ స్టెయిన్‌ ఓ పోస్టులో - మయాంక్ యాదవ్ ఇన్నేళ్లు ఎక్కడ దాక్కున్నావు! అని ట్వీట్‌ చేశాడు. ఆర్సీబీ మ్యాచ్‌లో అత్యంత వేగంగా బాల్‌ వేసిన తర్వాత స్టెయిన్ - దట్స్‌ ఎ సీరియస్‌ బాల్‌ #పేస్ అని ట్వీట్‌ చేశాడు. ఇకపోతే మే మొదటి వారంలో ఐసీసీ టీ20 జట్టును ప్రకటించే అవకాశం ఉండటంతో, మయాంక్‌ త్వరగా తిరిగి రావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. రానున్న మ్యాచ్‌లలో అదరగొట్టి సెలక్టర్లు దృష్టిని ఆకర్షించాలని, టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియా తరఫున ఆడాలని ఆశిస్తున్నారు.

కోహ్లీ, పంత్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ - టీ20 ప్రపంచకప్‌ జట్టు ఇదే! - T20 World Cup 2024

శ్రేయస్ క్రష్ ఆ అమ్మాయే - సీక్రెల్ రివీల్ చేసిన కేకేఆర్ కెప్టెన్ - Shreyas Iyer Crush

ABOUT THE AUTHOR

...view details