Delhi Capitals Head Coach Ricky ponting 1000 Bats :ఎంఎస్ ధోనీకి కార్‌లు, బైక్‌లు అంటే ఇష్టం. అతని కలెక్షన్‌లో వింటేజ్ కార్‌లు, స్పోర్ట్స్ బైక్‌లు చాలానే ఉంటాయి. అలా సచిన్, కోహ్లీ, రోహిత్ ఇంకా చాలా మంది క్రికెటర్లు తమ గ్యారేజ్‌లలో తమకిష్టమైనవి సేకరించి పెట్టుకుంటుంటారు. తాజాగా రికీ పాంటింగ్ తన గ్యారేజీలో ఏముంటాయో తెలిపాడు. క్రికెట్ హిస్టరీలో అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరు పొందిన ఈ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ తన గ్యారేజీలో బ్యాట్‌ల కలెక్షన్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. 1000కుపైగా బ్యాట్‌లు తన దగ్గర ఉన్నాయని తెలిపాడు.
తాను అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసిన ప్రతి బ్యాట్‌ను భద్రంగా దాచుకున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పటికీ అన్ని బ్యాట్‌లు చాలా మంచి కండిషన్‌లో ఉన్నాయని, వాటిపై ఉన్న స్టిక్కర్‌లు కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయని అన్నాడు. సెంచరీ చేసిన బ్యాట్‌లపై స్కోర్, అలానే ఆపోజిట్ టీమ్ పేరు కూడా రాసుకున్నట్లు గుర్తుచేసుకున్నాడు.
"బ్యాట్‌లు ఇంట్లో ఉండవు, నా గ్యారేజీలో ఉన్నాయి. నమ్మినా నమ్మకపోయినా, నా దగ్గర నా మొదటి బ్యాట్ ఇంకా ఉంది. ఇప్పటికీ స్టిక్కర్లతో సహా చక్కగా ఉంది. 2003 ప్రపంచ కప్ ఫైనల్ బ్యాట్ కూడా నా కలెక్షన్‌లో ఉంది." అని పాంటింగ్ చెప్పాడు. 2003 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇండియాపై ఆస్ట్రేలియా 125 పరుగులతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాంటింగ్ 140 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా అతను రెండు వరల్డ్ కప్‌లు గెలిచాడు.
- సెంచరీల బ్యాట్‌లే 71
1995 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు పాంటింగ్ అనంతరం కొన్ని నెలల తర్వాత క్రికెటర్ మార్క్ టేలర్ నేతృత్వంలో తన మొదటి టెస్టు ఆడాడు. శ్రీలంకపై ఆడిన అరంగేట్రం మ్యాచ్‌లో 96 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో మొత్తంగా 71 ఇంటర్నేషనల్ సెంచరీలు చేశాడు. అత్యధిక సెంచరీల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అతని కన్నా ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నారు. అంటే ఈ లెక్కన పాంటింగ్ బ్యాట్‌ల కలెక్షన్‌లో 71 సెంచరీలు బాదిన బ్యాట్‌లు ఉన్నాయన మాట. - దిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా
ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా, కోచ్‌గా కూడా వ్యవహరించాడు పాంటింగ్. ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. దిల్లీ జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తొమ్మిది మ్యాచ్‌లలో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన బుమ్రా - ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ - Jasprit Bumrah youtube channel
యువీకి అరుదైన గౌరవం- T20 వరల్డ్‌కప్ అంబాసిడర్‌గా ఎంపిక - 2024 T20 World Cup