తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెరిసిన మంధాన, జెమీమా- విండీస్​పై భారత్ గ్రాండ్ విక్టరీ - IND W VS WI W T20 2024

విండీస్​పై టీమ్ఇండియా గ్రాండ్ విక్టరీ- 1-0తో సిరీస్​లో లీడ్​లోకి భారత్

India Women vs West Indies Women
India Women vs West Indies Women (Source : IANS)

By ETV Bharat Sports Team

Published : 5 hours ago

IND W Vs WI W T20 2024: వెస్టిండీస్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. మూడు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా ఆదివారం ముంబయి వేదికగా జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా 49 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారత్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్ ఓవర్లన్నీ ఆడి 146-7 స్కోర్​కే పరిమితమైంది.

డియాండ్రా డాటిన్ (52 పరుగులు : 28 బంతుల్లో; 4x4, 3x6) దూకుడుగా ఆడింది. క్వీనా జోసెఫ్ (49 పరుగులు : 33 బంతుల్లో; 5x4, 3x6) కూడా రాణించినా, మిగతా ప్లేయర్ల నుంచి సహకారం లభించలేదు. టీమ్ఇండియా బౌలర్లలో టిటాస్ సాధు 3, దీప్తి శర్మ , రాధా యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సూపర్ హాఫ్ సెంచరీ (73 పరుగులు) తో అదరగొట్టిన జెమీమాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' లభించింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (54 పరుగులు : 33 బంతుల్లో; 7x4, 2x6) సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తూ హాఫ్‌ సెంచరీ సాధించింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (73 పరుగులు : 35 బంతుల్లో 9x4, 2x6) రఫ్పాడించింది. మరో ఓపెనర్ ఉమా ఛెత్రి (24 పరుగులు : 4x4), రిచా ఘోష్‌ (20 పరుగులు: 14 బంతుల్లో ; 2x4, 1x6), కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ (13*: 11 బంతుల్లో; 1x4) ఆకట్టుకున్నారు. విండీస్‌ బౌలర్లలో కరిష్మా 2, డియాండ్రా డాటిన్ ఒక వికెట్ పడగొట్టారు.

తాజా విజయంతో మూడు మ్యాచ్​ల సిరీస్​లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 17న రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్​కు కూడా నవీ ముంబయి డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది.

స్మృతి మంధాన సెంచరీ - సిరీస్‌ టీమ్ ఇండియా సొంతం

స్మృతి మంధాన ఆల్‌టైమ్ రికార్డ్ - ఏడాదిలో నాలుగోది

ABOUT THE AUTHOR

...view details