తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ ఫ్యాన్స్​కు PCB భారీ ఆఫర్! - 'క్రీడాభిమానులను పాక్ రప్పించేందుకే ఈ నిర్ణయం'! - CHAMPIONS TROPHY 2025

భారత్ క్రికెట్ జట్టు అభిమానులకు గుడ్​ న్యూస్!- ఛాంపియన్స్ ట్రోఫీపై పాక్ కీలక నిర్ణయం!

India Vs Pakistan Champions Trophy 2025
India Vs Pakistan Champions Trophy 2025 (IANS)

By ETV Bharat Sports Team

Published : Nov 2, 2024, 12:10 PM IST

India Vs Pakistan Championds Trophy 2025 : వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా సన్నాహాలు చేస్తోంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. భారత్- పాక్‌ మధ్య సంబంధాలు అంతగా లేకపోవడమే ఇందుకు కారణం. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఇండియా తమ దేశానికి వస్తుందని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే భారత అభిమానుల కోసం పీసీబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే?

త్వరితగతిన వీసాలు!
వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్​లను చూసేందుకు తమ దేశానికి రావాలనుకునే భారత అభిమానులకు త్వరితగతిన వీసాలు మంజూరు చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్, మంత్రి మొహ్సిన్ నఖ్వీ హామీ ఇచ్చారని ఓ వార్తా పత్రిక తన కథనంలో పేర్కొంది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్​లను చూసేందుకు భారత క్రికెట్ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాకిస్థాన్​కు వస్తారని పీసీబీ ఆశాభావంతో ఉందని నఖ్వీ చెప్పారని తెలుస్తోంది. లాహోర్‌ లో ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌ ను భారత అభిమానులు పాకిస్థాన్‌ కు వచ్చి వీక్షించాలని నఖ్వీ కోరారట.

"భారతీయ అభిమానుల కోసం ప్రత్యేక టికెట్ల కోటాను ఉంచుతాం. వీలైనంత త్వరగా వీసాలు జారీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్​ఇండియా పాకిస్థాన్ వస్తుందని ఆశాజనకంగా ఉన్నాం. భారత జట్టు పాక్​కు రావాలి. వారు ఇక్కడికి రారని నేను అనుకోవట్లేదు. పాకిస్థాన్​లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని జట్లకు మేము ఆతిథ్యం ఇస్తాం." అని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఓ వార్తా పత్రికకు తెలిపారు.

2008లో ముంబయి ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి పాకిస్థాన్ లో భారత జట్టు పర్యటించడం లేదు. ఇరు జట్లూ ఐసీసీ టోర్నీల్లో మాత్రమే మ్యాచ్ లు ఆడుతున్నాయి. అదీనూ తటస్థ వేదికలపైనే. ఇప్పుడు ఛాంపియన్స్‌ లోనూ ఫిబ్రవరి 23న భారత్ - పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇక ఫైనల్ కు లాహోర్‌ లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఒకవేళ భారత్ తుది పోరుకు చేరినా అక్కడే నిర్వహించాలనే ఉద్దేశంతోనే పాక్‌ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, టోర్నీలో భారత్‌ ఆడే ప్రతి మ్యాచ్‌ కూడా తటస్థ వేదికల్లోనే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్ కు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో హైబ్రిడ్ మోడల్ లో మ్యాచ్ లు నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత్ ఆడే మ్యాచ్‌ లు పాక్ లో కాకుండా, తటస్థ వేదికల్లో నిర్వహించడమే హైబ్రిడ్‌ మోడల్‌. ఇప్పటికే గత ఆసియా కప్ ను హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహించారు.

ప్లీజ్​, టీమ్‌ఇండియా మా దేశానికి రావాలి! : పాక్ కొత్త కెప్టెన్​

ఛాంపియన్స్ ట్రోఫీ - పాక్​ 'దిల్లీ' ప్రపోజల్​కు బీసీసీఐ నో

ABOUT THE AUTHOR

...view details