India Semis Scenario T20 Word Cup 2024 :ఐసీసీ 2024 మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే పాకిస్థాన్‌పై నెగ్గినప్పటికీ భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా ఉన్నాయి. గ్రూప్ Aలో 2 పాయింట్ల (-1.217)తో టీమ్ఇండియా నాలుగో స్థానంలో ఉండగా, తాజా మ్యాచ్‌లో పాక్ ఓడినప్పటికీ మెరుగైన రన్‌రేట్ (0.555) కారణంగా మూడో స్థానంలో కొనసాగుతోంది.
టాప్ 2 జట్లకే ఛాన్స్
అయితే గ్రూప్‌లో టాప్ 2లో ఉన్న రెండు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఈ లెక్కన భారత్ ఉన్న గ్రూప్ Aలో ప్రస్తుతం కివీస్, ఆసీస్ ఒక్కో విజయం (2 పాయింట్లు)తో టాప్ 2లో కొనసాగుతున్నాయి. కివీస్, ఆసీస్ చెరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, భారత్, పాక్, శ్రీలంకకు తలో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
టీమ్ఇండియా తదుపరి మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. అయితే పాకిస్థాన్‌పై విజయంతో సెమీ ఆశలు సజీవంగా ఉంచుకున్న, భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గాలి. అంతేకాకుండా ఇందులో ఏదో ఒక మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. అయితే ఆసీస్ బలమైన జట్టు కావడం వల్ల, భారత్ శ్రీలంకపై ఎక్కువ ఛాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రన్‌రేట్ మెరుగుపర్చుకునేందుకు ఈ మ్యాచ్ టీమ్ఇండియాకు అత్యంత కీలకం కానుంది.
ఇక శ్రీలంక తన చివరి మ్యాచ్‌లో కివీస్‌పై భారీ విజయం సాధించాలి. అటు ఆస్ట్రేలియా తదుపరి మూడు మ్యాచ్‌ల్లోనూ తప్పక నెగ్గాలి. అలాగే పాకిస్థాన్ తన తర్వాతి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ల ఫలితాలపై కూడా భారత్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ లెక్కన ప్రస్తుత టోర్నీలో టీమ్ఇండియా సెమీస్ చేరాలంటే ఆటతోపాటు కాస్త ఆదృష్టం కూడా తోడవ్వాలి.