India First Match Win:క్రికెట్లో టెస్టు ఫార్మాట్‌కు ఉండే క్రేజ్ వేరు. క్రికెట్లో తొలినాళ్లలో టెస్టు ఫార్మాట్లోనే మ్యాచ్‌లు జరిగేవి. అయితే భారత జట్టు కూడాఎన్నో సవాళ్లతో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇక మంచి ప్రదర్శన చేస్తున్నా, తొలి గెలుపు కోసం టీమ్ఇండియా చాలా ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. అనేక మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా విజయం అంచులదాకా వచ్చి ఓటమిపాలైన సందర్భాలెన్నో ఉన్నాయి. అలా ఓ దశాబ్దంపాటు ప్రయత్నించగా చివరకు 72 ఏళ్ల కిందట టీమ్ఇండియా టెస్టుల్లో తొలి విజయం అందుకుంది.
దాదాపు 23మ్యాచ్‌ల తర్వాత టీమ్ఇండియా 1952 ఫిబ్రవరి 8న క్రికెట్లో గెలుపు రుచి చూసింది. చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో నెగ్గింది. దిగ్గజ ఆటగాడు విజయ్ హరారే కెప్టెన్సీలో టీమ్ఇండియా తొలిసారి టెస్టుల్లో విజయం సాధించింది. నాటి లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ వినూ మన్కడ్ 12 వికెట్లు (తొలి ఇన్నింగ్స్ 8, రెండో ఇన్నింగ్స్ 4) పడగొట్టి టీమ్ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో టెస్టుల్లో సింగిల్ మ్యాచ్‌లో 10+ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.