తెలంగాణ

telangana

ETV Bharat / sports

Paris Olympics: రెజ్లింగ్ - క్వార్టర్స్‌కు చేరిన నిశా దహియా - PARIS OLYMPICS 2024

source ETV Bharat
Paris 2024 Olympics Live (source ETV Bharat)

By ETV Bharat Sports Team

Published : Aug 5, 2024, 1:24 PM IST

Updated : Aug 5, 2024, 7:54 PM IST

Paris 2024 Olympics Live:పారిస్ ఒలింపిక్స్​లో ఆదివారం పురుషుల హాకీ జట్టు విజయం మినహా, భారత్​కు పలు ఈవెంట్లలో నిరాశే ఎదురైంది. ఇక సోమవారం కూడా పలువురు భారత అథ్లెట్లు ఆయా క్రీడాంశాల్లో బరిలోకి దిగనున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్ సింగిల్స్ కాంస్య పతకం కోసం స్టార్ షట్లర్ లక్ష్యసేన్ బరిగిలోకి దిగనున్నాడు. తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కూడా మహిళల టీమ్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్​లో ఆడనుంది.

LIVE FEED

7:52 PM, 5 Aug 2024 (IST)

క్వార్టర్స్‌కు చేరిన నిశా దహియా

స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ కాంస్య పతక పోరులో భారత షూటర్లు మహేశ్వరి చౌహాన్, అనంత్‌జిత్ సింగ్ ద్వయం 43-44 చైనా జోడీ (జియాంగ్, జియాన్లిన్) చేతిలో పరాజయాన్ని చవిచూసింది.

క్వార్టర్స్‌కు చేరిన నిశా దహియా -రెజ్లింగ్‌ మహిళల ప్రిస్టైల్‌ 68 కేజీల విభాగంలో నిశా దహియా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-4తో టెటియానా సోవా రిజ్కో (ఉక్రెయిన్‌)పై గెలుపొందింది. తొలుత 1-4తో వెనుకబడిన నిశా ఆ తర్వాత గొప్పగా పుంజుకుని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక నిశా దహియా క్వార్టర్స్‌లో ఉత్తర కొరియాకు చెందిన సోల్ గమ్‌తో తలపడనుంది.

7:17 PM, 5 Aug 2024 (IST)

లక్ష్య సేన్​కు నిరాశ

Paris Olympics 2024 Lakshya Sen Lee Zii Jia :పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత స్టార్​ బ్యాడ్మింటన్‌ ప్లేయర్​ లక్ష్యసేన్‌ పోరాటం ముగిసింది. కాంస్య పతక పోరులో లక్ష్యసేన్‌ మలేషియాకు చెందిన జెడ్‌ జే లీ చేతిలో 21-13, 16-21, 11-21 తేడాతో ఓడిపోయాడు. ఈ పోరులో తొలి గేమ్‌ అలవోకగా నెగ్గిన సేన్‌ రెండు, మూడు గేమ్‌లలో మాత్రం చేతులెత్తేశాడు. కాగా, కుడి మోచేయికి గాయం వేధిస్తున్నా ఈ పోరులో గెలుపు కోసం పోరాడాడు లక్ష్యసేన్. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు పతకం రాకపోయినప్పటికీ లక్ష్యసేన్‌ పోరాటం ఆకట్టుకుంది. వాస్తవానికి తొలి సెట్‌లో ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన లక్ష్యసేన్‌ రెండో సెట్‌లో కాస్త డీలాపడ్డాడు. అదే సమయంలో పుంజుకున్న లీ జిజియా రెండో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుత ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌ మూడు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.

5:39 PM, 5 Aug 2024 (IST)

షూటింగ్​లో మరో పతకం దక్కే అవకాశం

పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌లో భారత్‌కు మరో కాంస్య పతకాన్ని అందుకునే ఛాన్స్​ వచ్చింది. స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు మహేశ్వరిచౌహాన్, అనంత్‌జిత్​సింగ్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. మూడు రౌండ్లలో కలిపి భారత్‌ 146 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. చైనాజోడీ(జియాంగ్, జియాన్లిన్) కూడా 146 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచింది. మూడు రౌండ్లలో మహేశ్వరి వరుసగా 24, 25, 25 (మొత్తం 74), అనంత్‌ 25, 23, 24 (మొత్తం 72) సాధించారు.

మరోవైపు, అథ్లెటిక్స్‌ మహిళల 400మీ పరుగు మొదటి రౌండ్‌లో కిరణ్​పహాల్ మెరుగైన ప్రదర్శన చేసింది. హీట్‌ 5లో 52.51 సెకన్లలో పరుగు పూర్తి చేసి ఏడో స్థానం దక్కించుకుంది. దీంతో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించేందుకు రేపిచేంజ్‌ రౌండ్‌ రూపంలో మరో ఛాన్స్ దక్కించుకుంది. రేపిచేంజ్‌ రౌండ్‌ ఆగస్టు 6న మధ్యాహ్నం 2:50 గంటలకు జరగనుంది.

4:38 PM, 5 Aug 2024 (IST)

పారిస్ ఒలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో 3-2 తేడాతో రొమేనియాపై విజయం సాధించింది. దీంతో మనికా బాత్రా, ఆకుల శ్రీజ, అర్చనా కామత్‌లతో కూడిన భారత త్రయం ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత జట్టుగా చరిత్ర సృష్టించింది. తొలుత డబుల్స్‌లో ఆకుల శ్రీజ, అర్చనా కామత్‌ జోడీ అద్భుతంగా ఆడి మూడు గేమ్‌ల్లోనూ ఆధిక్యంలో నిలిచింది. 11-9, 12-10, 11-7తో డయాకోను, సమర ఎలిజబెటాను ఓడించడంతో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది.

2:22 PM, 5 Aug 2024 (IST)

  • రెండో గేమ్​లోనూ మనికా ఆధిపత్యం
  • 11-7తో రెండో గేమ్ కైవసం

2:09 PM, 5 Aug 2024 (IST)

  • రెండో మ్యాచ్​లో బరిలో దిగిన మనికా బాత్ర
  • 11-5 తొలి గేమ్ సొంతం చేసుకున్న మనిక

2:04 PM, 5 Aug 2024 (IST)

  • రొమానియాపై ఆధిపకత్యం కొనసాగిస్తున్న శ్రీజ- అర్చన
  • 1-0తో తొలి మ్యాచ్ నెగ్గిన శ్రీజ- ఆర్చన
  • భారత్ 1- రొమానియా 0

1:54 PM, 5 Aug 2024 (IST)

  • టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్​లో భారత్ శుభారంభం
  • తొలి సెట్ 11-9తో కైవసం చేసుకున్న శ్రీజ- అర్చన
  • 12-10తో రెండో సెట్ కూడా కైవసం
  • రొమానియాతో తలపడుతున్న భారత్ మహిళల టీమ్

1:52 PM, 5 Aug 2024 (IST)

  • మిక్స్​డ్ టీమ్ ఈవెంట్​లో తొలి రౌండ్ పూర్తి
  • తొలి రౌండ్ తర్వాత 2వ స్థానంలో మహేశ్వరీ, అనంత్​జీత్
  • 3 రౌండ్ల తర్వాత తుది ఫలితం

1:23 PM, 5 Aug 2024 (IST)

  • షూటింగ్ మిక్స్​డ్ టీమ్ ఈవెంట్​లో భారత్
  • క్వాలిఫికేషన్​ రౌండ్​లో మహేశ్వరీ, అనంత్​జీత్ సింగ్​
Last Updated : Aug 5, 2024, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details