ROHITH SHARMA MOST SIXES RECORD :టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన హిట్టింగ్ స్టైల్‌తో క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టైలిష్ షాట్లు, హిట్టింగ్తో ప్రేక్షకులను తెగ అలరిస్తాడు. వీలుచిక్కినప్పుడల్లా బంతిని గ్రౌండ్ బయటకి పంపిస్తుంటాడు. అయితే ఈ దిగ్గజ బ్యాటర్ శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా వ్యవహరించి అత్యధిక సిక్సర్ల బాదిన బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. శ్రీలంక జరిగిన మొదటి వన్డేలో ఈ ఫీట్‌ను హిట్ మ్యాన్ టచ్ చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్లుగా ఉండి అత్యధిక సిక్స్‌లు కొట్టిన టాప్- 5 బ్యాటర్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Top 5 Most Sixes By a Captain :
1. రోహిత్ శర్మ (234 సిక్సర్లు)
శ్రీలంకతో శుక్రవారం జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ 47 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. దీంతో రోహిత్ కెప్టెన్‌గా అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా ఇంగ్లాండ్ బ్యాటర్ ఇయాన్ మోర్గాన్ రికార్డును బద్దలు కొట్టాడు. సారథిగా 134 ఇన్సింగ్ ల్లోనే 234 సిక్స్‌లు బాదాడు.
2. ఇయాన్ మోర్గాన్ (233 సిక్సర్లు)
ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ ఇయాన్ మోర్గాన్ 11 ఏళ్ల పాటు ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో 180 ఇన్సింగ్స్‌లో 233 సిక్సర్లను బాదాడు ఈ లెఫ్ట్ హ్యాండర్. 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన ఓ మ్యాచులో మోర్గాన్ ఏకంగా 17 సిక్సర్లు బాదడం విశేషం.
3. ఎంఎస్ ధోనీ (211 సిక్సర్లు)
భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మొత్తం 211 సిక్సర్లు బాదాడు. ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించిన 2007-2018 మధ్య కాలంలో 330 ఇన్నింగ్స్‌లో ఈ బౌండరీలను కొట్టాడు.
రోహిత్ ఖాతాలో మరో రికార్డు - కెప్టెన్‌గా అత్యధిక సిక్స్‌లు బాదిన టాప్-5 బ్యాటర్స్ వీరే - Rohith Sharma Sixes Record - ROHITH SHARMA SIXES RECORD
ROHITH SHARMA MOST SIXES RECORD : కెప్టెన్‌గా అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా అత్యధిక సిక్సులు కొట్టిన టాప్-5 బ్యాటర్స్ ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ROHITH SHARMA MOST SIXES RECORD (source Getty Images and Associated Press)
Published : Aug 3, 2024, 8:39 PM IST