Ind vs Pak T20 World Cup:2024 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ మరోసారి పంజా విసిరింది. న్యూయార్క్ నసావు క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో నెగ్గింది. టీమ్ఇండియా పేస్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన (3/14)తో భారత్ విజయం అందుకుంది. భారత్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో 113-7కే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (31 పరుగులు) టాప్ స్కోరర్. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా 3, హార్దిక్ పాండ్య 2, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభం ఆచితూచి ఆడింది. పవర్ ప్లేలో 1 వికెట్ కోల్పోయినా 10 ఓవర్లకు 57-1తో మెరుగైన స్థితిలోకి వచ్చింది. ఆ తర్వాత కూడా వికెట్లు పడినప్పటికీ పాక్‌కే విజయావకాశాలు ఎక్కువ. దాయాది దేశం చేతిలో భారత్‌కు ఓటమి తప్పదు అనుకున్న దశలో బుమ్రా మ్యాజిక్ చేశాడు. 14.1 వద్ద రిజ్వాన్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడం వల్ల భారత్ మళ్లీ రేస్‌లోకి వచ్చింది. అక్కడ్నుంచి భారత్ బౌలర్లు కట్టుదిడ్డంగా బంతులేయడం వల్ల పరుగులు చేయడం పాక్‌కు కష్టమైంది.
ఇక చివర్లో 18 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన దశలో, 18వ ఓవర్ వేసిన సిరాజ్ 9 పరుగులిచ్చాడు. ఇక 19 ఓవర్లోనే మ్యాచ్ అసలైన మలుపు తిరిగింది. ఈ ఓవర్లో బుమ్రా కేవలం 3 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీయడం వల్ల మ్యాచ్ దాదాపు టీమ్ఇండియా చేతుల్లోకి వచ్చింది. ఇక ఆఖరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా అర్షదీప్ 11 పరుగులిచ్చి 1 వికెట్ తీసి భారత్‌కు విజయాన్ని అందించాడు.
ఆరంభం పేలవం:అంతకుముందుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో ఓవర్ మూడో బంతికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (4) ఔటయ్యాడు. ససీమ్ షా వేసిన బంతికి క్యాచౌట్‌గా విరాట్ పెవిలియన్ చేరాడు. కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ (13) షహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచౌట్ అయ్యాడు. దీంతో 19 పరుగులకే భారత్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.