Ind vs Pak Champions Trophy 2025 :ఐసీసీ నిర్వహించే ఏ టోర్నమెంట్లో అయినా భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే హైప్ వేరు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఈ రెండు జట్ల అభిమానులే కాదు, వరల్డ్‌వైడ్‌గా క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా దాయాది దేశాలు మరో సమరానికి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం భారత్- పాక్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2017 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో భారత్ బరిలోకి దిగనుంది.
జోష్‌లో టీమ్ఇండియా
ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో బంగ్లాపై నెగ్గిన టీమ్ఇండియా అదే ఊపులో పాక్‌తో సమరానికి రెడీ అవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ టచ్‌లోకి రాగా, గిల్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్థాన్‌పై మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న విరాట్ ఈసారి కూడా చెలరేగితే భారీ స్కోర్ ఖాయం. ఇక బౌలింగ్ దళం మరోసారి రాణిస్తే టీమ్ఇండియాకు తిరుగు ఉండదు.
ఓడితే అంతే
అటు పాకిస్థాన్ పరిస్థితి భిన్నంగా ఉంది. మనం విజయంతో టోర్నీని ప్రారంభించగా, పాక్‌కు తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. ఈ బాధలో ఉండగానే స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్ దూరమయ్యాడు. ఈ పరిస్థితుల్లో బలమైన భారత్‌ను ఢీ కొట్టేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ ఓడితే వాళ్ల పని అంతే. టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టాల్సిందే.
భారత్- పాక్ రికార్డులు
వాళ్లదే పైచేయి : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్- పాకిస్థాన్ ఇప్పటివరకూ ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో మూడు సార్లు పాకిస్థాన్ నెగ్గగా, రెండింట్లో భారత్ విజయం సాధించింది.
పాక్‌దే తొలి విజయం :2004 ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి భారత్- పాక్ తలపడ్డాయి. సెప్టెంబర్ 19న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 200 పరుగులు చేయగా, పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇకరెండోసారి 2009లో సెంచూరియన్ వేదికగా తలపడ్డాయి. పాక్ 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఛేదనలో భారత్ 44.5 ఓవర్లలో 248 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌పై రెండోసారి విజయాన్ని నమోదు చేసింది.