తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెమీస్​లోకి దూసుకెళ్లిన టీమ్ఇండియా- నేపాల్​పై భారత్ 132 పరుగులతో విక్టరీ - India U19 World Cup 2024

Ind vs Nep U19 World Cup 2024: అండర్ 19 వరల్డ్​కప్ టోర్నీ లీగ్ స్టేజ్​ను భారత్ విజయంతో ముగించింది. శుక్రవారం నేపాల్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ 132 పరుగులతో విజయం సాధించింది.

Ind vs Nep U19 World Cup 2024
Ind vs Nep U19 World Cup 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 10:00 PM IST

Updated : Feb 2, 2024, 10:33 PM IST

Ind vs Nep U19 World Cup 2024:అండర్- 19 వరల్డ్​కప్​లో యువ భారత్ సెమీల్​లోకి దూసుకెళ్లింది. శుక్రవారం (ఫిబ్రవరి 02)న నేపాల్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ 132 పరుగులు తేడాతో నెగ్గింది. భారత్ నిర్దేశించిన 298 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ దేవ్ కనల్ (33) టాప్​ స్కోరర్. టీమ్ఇండియా బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లతో అదరగొట్టాగా, అర్శిన్ కులకర్ణి 2, మురుగన్ అభిషేక్, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబని తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఫిబ్రవరి 6న భారత్ సెమీస్​లో సౌతాఫ్రికా​ను ఢీ కొట్టనుంది.

లక్ష్య ఛేదనలో నేపాల్​ను భారత్ తొలి నుంచే దెబ్బకొట్టింది. ఓపెనర్లు దీపక్ (22 పరుగులు, 42 బంతుల్లో), అర్జున్ కుమల్ (26 పరుగులు, 64 బంతుల్లో) క్రీజులో కుదురుకొని తొలి వికెట్​కు 48 పరుగులు జోడించారు. అయితే కీలకమైన ఈ పార్ట్​నర్​షిప్​ను రాజ్ లింబని విడగొట్టాడు. తర్వాత కాసేపటికే వన్​ డౌన్​లో వచ్చిన ఉత్తమ్ తపా మంగర్ (8)ను సౌమి పాండే వెనక్కిపంపాడు. ఈ తర్వాత నేపాల్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అర్జున్ కుమల్, దేవ్ ఖనల్, బిషల్ బిక్రమ్ (1), దీపక్ దమ్రే (0), గుల్సన్ ఝా (1), దీపేశ్ ఖండేల్ (0), సుభాశ్ (5) పెవిలియన్​కు క్యూ కట్టారు. ఓ దశలో నేపాల్ ఆలౌట్ అవుతుందని భావించారంతా. కాని 10వ వికెట్​కు టెయిలెండర్లు ఆకాశ్ చాంద్ (19), దుర్గేశ్ గుప్తా (29) అజేయంగా 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో నేపాల్ ఆలౌట్ భారి నుంచి తప్పించుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 297 పరుగుల చేసింది. 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఓ దశలో భారత్ కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ ఉదయ్ సహారన్ (100 పరుగులు, 109 బంతుల్లో: 9x4), సచిన్ దాస్ (116 పరుగులు, 101 బంతుల్లో: 11x4, 3x6) సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్​కు ఏకంగా 215 పరుగుల జోడించారు. ఇక ఆఖర్లో ఈ ఇద్దరూ పెవిలియన్ చేరారు. నేపాల్ బౌలర్లలో గుల్సన్ ఝా 3, ఆకాశ్ చాంద్ 1 వికెట్ దక్కించుకున్నారు.

అండర్‌19 ప్రపంచకప్‌ - భారత్‌ ఘన విజయం

ఒకే రోజు అటు అన్న - ఇటు తమ్ముడు - సెంచరీలతో దంచేశారు!

Last Updated : Feb 2, 2024, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details