తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ x ఐర్లాండ్ - చిన్న జట్టే అయినా తగ్గేదేలే! - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

IND VS IRE T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్​లో భాగంగా నేడు ( జూన్​ 5) భారత్, ఐర్లాండ్​కు మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయంటే?

IND VS IRE T20 World Cup 2024
IND VS IRE T20 World Cup 2024 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 7:21 AM IST

IND VS IRE T20 World Cup 2024 :ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ సమరం అట్టాహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే పలు టీమ్స్ తమ సత్తా చాటగా, ఇప్పుడు టీమ్ఇండియా​ తొలి పోరుకు సమయం ఆసన్నమైంది. ఐర్లాండ్​తో తమ తొలి మ్యాచ్​ను ఆడేందుకు రోహిత్​ సేన సిద్ధమైంది. రెండు జట్లకు మధ్య పోటీ లేనప్పటికీ కొన్ని ఐర్లాండ్‌ను చిన్న జట్లలో మంచి ఫామ్​ ఉన్న టీమ్​గా చెప్పొచ్చు. అసోసియేట్‌ దేశాలపై ఆధిపత్యం చలాయించే ఆ జట్టు, అప్పుడప్పుడూ పెద్ద జట్లకు కూడా తమ స్టైల్​లో షాకులిస్తుంటుంది.

ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో ఆడే స్టిర్లింగ్, లిటిల్, క్యాంఫర్, అడైర్‌ లాంటి ప్లేయర్స్​తో ఆ జట్టు మెరుగ్గానే కనిపిస్తోంది. అందుకే ఆ జట్టును తక్కువ అంచనా వేయకుండా టీమ్‌ఇండియా ప్లేయర్లు తమ స్థాయికి తగ్గట్లు ఆడి విజయం సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది.

ఇక తొలి మ్యాచ్‌ భారత్​కు ఓ వార్మప్ మ్యాచ్​ లాంటిదే అనుకోవచ్చు. అందుకే ఇందులో మంచి స్కోర్ సాధించి, జట్టు కూర్పు సరిచూసుకోవాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. అయితే ఎక్కువ మంది ఆల్‌రౌండర్లను ఈ సారి జట్టులో ఉండేలా చూస్తామని రోహిత్‌ చెప్పినందున ఈ మ్యాచ్​లో యంగ్ ప్లేయర్ శివమ్‌ దూబెకు ఛాన్స్​ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో యశస్వి జైస్వాల్‌ బెంచ్‌కే పరిమితం కావొచ్చు.

ఇదిలా ఉండగా, రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ మూడో స్థానంలో, రిషబ్‌ పంత్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగొచ్చు. వీరందరి తర్వాత హార్దిక్ క్రీజులోకి దిగుతాడు.

ఐపీఎల్‌లో, బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ మెరుపులు మెరిపించాడు. బ్యాటింగ్​లోనూ అతడు మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. దీంతో జడేజా స్థానంలో అతడు ఈ మ్యాచ్​లోకి ఎంట్రీ ఇచ్చేలా కనిపిస్తోంది. స్పెషలిస్టు స్పిన్నర్లలో కుల్‌దీప్​కు మాత్రమే అవకాశం దక్కొచ్చు. బుమ్రాతో కలిసి అర్ష్‌దీప్, సిరాజ్‌ పేస్‌ బాధ్యతలు పంచుకుంటారు. పిచ్‌ స్పిన్‌కు ఎక్కువ అనుకూలం అనుకుంటే, సిరాజ్‌ స్థానంలో చాహల్‌ వచ్చే అవకాశముంది.

ఆల్‌రౌండర్లదే హవా : 2011 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి సంచలనం సృష్టించినప్పటి నుంచి ఐర్లాండ్‌ జట్టును అంతర్జాతీయ క్రికెట్లో ఎవ్వరూ అంత తేలిగ్గా తీసుకోవట్లేదు. ముఖ్యంగా జట్ల మధ్య అంతరం తక్కువగా ఉండే టీ20ల్లోనూ ఎక్కువగా ఆల్‌రౌండర్లతో నిండిన ఐర్లాండ్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. క్యాంఫర్, అడైర్, డెలానీ, డాక్రెల్, టెక్టార్, స్టిర్లింగ్‌, ఇలా ఐర్లాండ్ తుది జట్టులో ఆరుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు తుది జట్టులో ఆడిస్తుంది ఐర్లాండ్‌. వీరిలో స్టిర్లింగ్‌ ఈ మధ్య బ్యాటింగ్‌కే పరిమితమవుతున్నాడు. ఓపెనింగ్‌లో అతను దూకుడుగా ఆడి జట్టుకు మంచి స్కోర్ అందిస్తున్నాడు. కెప్టెన్‌ బాల్‌బిర్నీ కూడా ఇటీవలె మంచి ఫామ్‌లో ఉన్నాడు. టెక్టార్, టకర్, డాక్రెల్, డెలానీ, క్యాంఫర్, అడైర్‌, ఇలా కింది వరుస వరకు బ్యాటుతో సత్తా చాటగలరు. బౌలింగ్‌లో లిటిల్, యంగ్, అడైర్‌ కీలకంగా మారనున్నారు.

బౌలర్ల ఫేవరట్​ :న్యూయార్క్‌ క్రికెట్‌ స్టేడియం ప్రపంచకప్‌లో ఇప్పటికే ఓ మ్యాచ్‌ జరిగింది. అందులో శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలగా, అంత చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి సౌతాఫ్రికా ఎంతో శ్రమించింది. 4 వికెట్లు కోల్పోయి 16వ ఓవర్లలో కానీ గెలుపు సాధించలేకపోయింది. దీన్ని బట్టే ఇక్కడ బౌలర్లదే హవా ఎలా ఉందో అర్థమవుతోంది.

ఇక్కడే బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లోనూ టీమ్‌ఇండియా బాగానే బ్యాటింగ్‌ చేసింది. 5 వికెట్లకు 182 పరుగులు సాధించింది. కానీ బంగ్లా మాత్రం 122/9కి పరిమితమైంది. ఆ అనుభవం భారత బ్యాటర్లు, బౌలర్లకు ఉపయోగపడేదే. అయితే దక్షిణాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌ పిచ్‌పై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో పిచ్‌ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటివరకు ఐర్లాండ్‌తో ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత్‌, అందులో ఏడింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ ఫలితం రాలేదు.

భారత తుది జట్టు (అంచనా) :రోహిత్‌ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మబ్మగ్ సిరాజ్‌.

ఐర్లాండ్‌ తుది జట్టు (అంచనా) :బాల్‌బిర్నీ (కెప్టెన్‌), స్టిర్లింగ్, యంగ్, టెక్టార్, టకర్, డాక్రెల్, డెలానీ, క్యాంఫర్, అడైర్, మెకార్తీ, వైట్‌.

'టీమ్​ఇండియాకు ఓ న్యాయం - మాకో న్యాయమా!' - T20 WORLDCUP 2024

తొలి మ్యాచ్​లోనే షాక్​ - 58 పరుగులకే కుప్పకూలిన ఉగాండా

ABOUT THE AUTHOR

...view details