తెలంగాణ

telangana

ETV Bharat / sports

అరంగేట్రంలోనే అదరగొట్టేస్తున్న కుర్రాళ్లు - ప్రత్యర్థి జట్టు ఢమాల్​! - IND VS ENG Test Series 2024

ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో అరంగేట్రంలోనే కుర్రాళ్లు అదరగొడుతున్నారు. తమ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టును హడలెత్తిస్తున్నారు. వారి గురించే ఈ కథనం.

అరంగేట్రంలోనే అదరగొట్టేస్తున్న కుర్రాళ్లు - ప్రత్యర్థి జట్టు ఢమాల్​!
అరంగేట్రంలోనే అదరగొట్టేస్తున్న కుర్రాళ్లు - ప్రత్యర్థి జట్టు ఢమాల్​!

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 11:54 AM IST

IND VS ENG Test Series 2024 Debut players : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్​కు వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ, మూడో టెస్టులో గాయంతో కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ ఆడలేదు. దీంతో ఒకరిద్దరు మినహా బ్యాటింగ్‌ ఆర్డర్​ అనుభవలేమితో నిండింది. కానీ సిరీస్‌లో 2-1తో టీమ్​ ఇండియానే ఆధిక్యంలో నిలిచింది. ఇక సూపర్ ఫామ్​లో ఉన్న ప్రధాన పేసర్‌ బుమ్రా కూడా నాలుగో టెస్టు రెస్ట్ తీసుకున్నాడు. అయినా తొలి సెషన్‌లోనే ఐదు వికెట్లు పడ్డాయి. మరి ఇంగ్లిష్‌ జట్టుపై ఈ ఆధిపత్యానికి ప్రధాన కారణం ఏంటంటే టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్స్​. ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన కుర్రాళ్లు తమకొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అదరగొడుతున్నారు. తమ అద్భుత నైపుణ్యాలతో జట్టు భవిష్యత్‌పై భరోసాను కల్పిస్తున్నారు.

వర్క్ లోడ్ కారణంగా నాలుగో టెస్టులో బుమ్రాకు విశ్రాంతినిచ్చిన మేనెజ్​మెంట్​ యువ పేసర్‌ ఆకాశ్‌దీప్‌కు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాన్ని ఇచ్చింది. దీంతో ఈ పేసర్‌ వచ్చీ రాగానే సత్తా చాటాడు. బౌన్స్, స్వింగ్‌తో ఇంగ్లాండ్‌ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. నిప్పుల్లాంటి బంతులతో చెలరేగుతూ రెండు ఓవర్ల వ్యవధిలోనే ఇంగ్లాండ్‌ టాప్‌-3 బ్యాటర్లను పెవిలియన్ పంపాడు. నిలకడగా ఒకే లెంగ్త్‌లో బంతులు సంధించి వికెట్లను తీశాడు. అలా గొప్పగా బంతులేసిన 27 ఏళ్ల ఈ బెంగాల్‌ పేసర్‌ 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులు ఆడి 23.58 యావరేజ్​తో 104 వికెట్లు పడగొట్టాడు. 28 లిస్ట్‌- ఎ మ్యాచ్‌ల్లో 24.50 యావరేజ్​తో 42 వికెట్లు, 41 టీ20 మ్యాచ్‌ల్లో 22.81 సగటుతో 48 వికెట్లను దక్కించుకున్నాడు.

ఈ సిరీస్​లో ఆకాశ్‌ దీప్‌తో పాటు ఇప్పటికే నలుగురు భారత ఆటగాళ్లు కూడా ఈ సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చారు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఛాన్స్​​ దక్కించుకున్న రజత్‌ పటీదార్ తన​ తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత మూడు ఇన్నింగ్స్‌లో అవకాశాలను వృథా చేసుకున్నాడు. కానీ అత్యున్నత స్థాయిలో ఆడే ప్రతిభ ఉందనే సంకేతాలను పంపించాడు.

Sarfaraz Khan Test series : రాజ్‌ కోట్‌లో జరిగిన మూడో మ్యాచ్​లో సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జూరెల్‌ అరంగేట్రం చేశారు. దేశవాళీ క్రికెట్​లో మంచిగా రాణిస్తున్నప్పటికీ టీమ్​ ఇండియాలో చోటు దక్కించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అవకాశాన్ని అందుకున్న అతడు వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో మెరిశాడు. అరంగేట్ర టెస్ట్​లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు బాదిన నాలుగో భారత ప్లేయర్​గా రికార్డుకెక్కాడు.

మరోవైపు వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ కూడా మస్త్​గా రాణించాడు. 23 ఏళ్ల ఈ ఉత్తరప్రదేశ్‌ ప్లేయర్​ తన తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులతో మంచి ప్రదర్శన చేశాడు. ఓపికతో క్రీజులో ఉండి ఉత్తమ పరిణతిని చూపించాడు. ఇలా కుర్రాళ్లు అరంగేట్రంలోనే వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నారు.

జడ్డు దెబ్బకు ఇంగ్లాండ్ హడల్​ - 353 పరుగులకు ఆలౌట్‌

గ్రాండ్​గా WPL ప్రారంభం- స్పెషల్ అట్రాక్షన్​గా బాలీవుడ్ స్టార్స్​ పెర్ఫార్మెన్స్​

ABOUT THE AUTHOR

...view details