IND vs ENG Rohith Sharma : టీమ్ ఇండియా ఎలాంటి పిచ్‌లపైనైనా విజయం సాధించగలదని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. రాజ్ కోట్ టెస్టులో ఇంగ్లాండ్‌ను 434 పరుగుల భారీ తేడాతో టీమ్‌ఇండియా ఓడించింది. అయితే నాలుగో రోజు మూడో సెషన్‌లో బంతి విపరీతంగా టర్న్ అయింది. దీంతో భారత స్పిన్నర్లు చెలరేగి ఆడారు. రవీంద్ర జడేజా 5, కుల్‌దీప్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. పేసర్ బుమ్రా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్ తీశాడు. దీంతో టీమ్‌ఇండియా టర్నింగ్ పిచ్‌ల సాయంతో విజయాలు సాధిస్తోందని విమర్శలు వినిపించాయి. ఇప్పుడు వాటిని హిట్ మ్యాన్ కొట్టిపారేశాడు. అలాంటి వారికి తిరిగి కౌంటర్ ఇచ్చాడు.
ఇలాంటి పిచ్‌లపై మేం గతంలోనూ చాలా మ్యాచులే విజయం సాధించాం. టర్నింగ్ ట్రాక్‌లపై బాగా తిరిగే బంతిని ఎదుర్కోవడంతో పాటు మిగతా పిచ్‌లపైనా(పేస్) ఆడటం మాకున్న బలం. భవిష్యత్తుల్లోనూ అద్భుత ఫలితాలను అందుకుంటాం. ఇలాంటి పిచ్‌లనే తయారు చేయండి అంటూ మేం ఎవరికీ చెప్పము. అసలు దాని గురించి కూడా మాట్లాడము. ఎప్పుడైనా మ్యాచ్‌కు రెండు రోజుల ముందే సదరు స్టేడియానికి కు వెళ్తాం. అంత తక్కువ వ్యవధిలో మేం చేసేదేముంటుంది? పిచ్‌ను ఎలా తయారు చేయాలనేది క్యురేటరే డెసిషన్ తీసుకుంటాడు. ఎలాంటి మైదానంలోనైనా గెలవగల సత్తా టీమ్ ఇండియాకు ఉంది. దక్షిణాఫ్రికా కేప్‌టౌన్‌లో మేం విజయం సాధించిన విషయం, అక్కడి పిచ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే.