Ind vs Eng 4th Test :నాలుగో టెస్టులో భారత్ టార్గెట్‌ను 192 పరుగులుగా ఇంగ్లాండ్ ఫిక్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ జట్టు 145కి ఆలౌటైంది. ఇక ఇంగ్లీష్ జట్టులో జాక్ క్రాలే (60) టాప్ స్కోరర్‌గా నిలవగా, అదే జట్టుకు చెందిన బెయిర్‌స్టో (30), బెన్ డకెట్(15), జోరూట్ (11), ఫోక్స్ (17)లు డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. వీరు మినహా మిగతా ఎవరూ రెండంకెల పరుగులు చేయలేకపోయారు.
మరోవైపు భారత బౌలర్లలో అశ్విన్ 5, కుల్‌దీప్ 4, జడేజా ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 353 స్కోర్ చేయగా, భారత్ 307 పరుగులు సాధించింది.
ఇక ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 40 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ శర్మ (24*), యశస్వి జైస్వాల్ (16*) ఉన్నారు. అయితే టీమ్‌ఇండియా విజయానికి ఇంకా 152 పరుగులు అవసరం.
రాంచీ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో నమోదైన రికార్డులు ఇవే
- రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో ఐదు వికెట్లతో చెలరేగడం ఇది 35వ సారి. దీంతో ఈ లిస్ట్‌లో ఇప్పటికే టాప్‌లో ఉన్న కుంబ్లేతో అశ్విన్ సమంగా నిలిచాడు. అయితే, అశ్విన్ ఈ రికార్డును 99 మ్యాచుల్లో సాధించగా, కుంబ్లే 132 టెస్టులు తీసుకున్నాడు. ఇక ఈ లిస్ట్‌లో శ్రీలంక మాజీ ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టుల్లో 67 సార్లు, షేన్ వార్న్ 145 టెస్టుల్లో 37 సార్లు ఫైఫర్ తీశారు.
- ఇంగ్లీష్ ప్లేయర్లు బెన్ స్టోక్స్ - మెక్‌కల్లమ్ సారథ్యంలో ఆ జట్టు 3 రన్‌రేట్ కంటే తక్కువగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు అత్యల్పంగా 3.13 రన్‌రేట్‌తో చేయగా, ఈ మ్యాచ్‌లో 2.69 రన్‌రేట్‌తోనే ఆడటం గమనార్హం.
- భారత్ వేదికగా జరిగిన టెస్టుల్లో ఆతిథ్య జట్టు ఏదీ 200 కంటే తక్కువైన టార్గెట్‌ను కాపాడుని గెలిచిన రికార్డులు లేవు. ఇప్పటి వరకు 32 సందర్భాల్లో మూడుస్లారు డ్రా కాగా, 29 మ్యాచుల్లో ఓడాయి.
- టెస్టుల్లో 4000+ పరుగులు చేసిన ఆటగాడిగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. 58 టెస్టుల్లో ఈ ఘనతను సాధించాడు.
యశస్వి రికార్డుల మోత- సెహ్వాగ్‌ను దాటి, గావస్కర్ సరసన జైశ్వాల్
భారత్xఇంగ్లాండ్- పడిలేచిన టీమ్ఇండియా- డే 2 కంప్లీట్