తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ - బంగ్లా ప్లేయర్స్​ కోసం స్పెషల్ డైట్​ మెనూ - ఏమేం ఉన్నాయంటే? - IND VS BAN Players Diet Chart

IND VS BAN Players Diet Chart : భారత్ - బంగ్లాదేశ్ క్రికెటర్ల డైట్ ఛార్ట్ చాలా ప్రత్యేకంగా రూపొందించారు. ఆర్టిఫీషియల్ ఫుడ్ అనేదే లేకుండా పూర్తిగా ఆరోగ్యకరమైన, సహజ సిద్ధమైన ఫుడ్​ను ప్రిపేర్ చేస్తున్నారు. ఆ మెనూ ఏంటో తెలుసుకుందాం.

IND VS BAN Players Diet Chart
IND VS BAN Players Diet Chart (source ETV Bharat and Associated Press)

By ETV Bharat Sports Team

Published : Sep 20, 2024, 9:33 AM IST

IND VS BAN Players Diet Chart : క్రికెటర్ల ఫిట్​నెస్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఆ స్థాయి ఫిట్​నెస్ మెయిన్​టెయిన్ చేయాలంటే డైట్​ కచ్చితంగా పాటించాల్సిందే. ఆరోగ్యకరమైన ఫుడ్​ తీసుకోవాల్సిందే. అలానే రుచికరమైన ఆహారాన్ని కూడా వారు తీసుకుంటుంటారు. అయితే వారికి ఆ తరహాలోనే టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అందించేందుకు రెడీ అయింది హోటల్ ల్యాండ్ మార్క్ . ప్రస్తుతం భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ చెన్నై చెపాక్​ స్టేడియం వేదికగా జరుగుతోంది. రెండో టెస్టు కాన్పూర్‌లోని హిస్టారిక్​ గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు సివిల్ లైన్స్‌లో ఉన్న హోటల్ ల్యాండ్ మార్క్‌లో ప్లేయర్లు బస చేస్తారు.

అయితే ఈ ప్లేయర్ల కోసం ల్యాండ్ మార్క్​ హోటల్ స్వయంగా ఎన్నో రకాల వంటలతో పాటు ప్లేయర్లకు ఫేవరేట్ ఫుడ్ కూడా సిద్ధం చేస్తున్నారట. ఈ విషయాన్ని సదరు హోటల్ హెడ్ చెఫ్ బలరామ్ సింగ్ వెల్లడించారు. డైట్ ఛార్ట్ రెడీ అయిపోయిందని, ఆటగాళ్ల కోసం వంటకాలను ప్రీపేర్ చేయడం మొదలుపెట్టినట్లు తెలిపారు.

IND VS BAN Players Food Menu :ఈటీవీ భారత్‌తో మాట్లాడిన హెడ్ చెఫ్ బలరాం - "ఆటగాళ్లకు ఐదు రోజుల పాటు వరుసగా ఐదు డిఫరెంట్ థీమ్స్​తో కూడిన ఆహారం అందించేందుకు ప్లాన్ చేశాం. అవాధి, రాజస్థానీ, గుజరాతీ, కోస్టల్‌లతో పాటు ఇతర థీమ్‌లతో కూడిన ఆహారం అందిస్తాం. అంతేకాకుండా వారికి ఇంకేదైనా ప్రత్యేకమైన ఆహారం తినాలనిపిస్తే దానిని కచ్చితంగా తయారుచేసి వారికి అందజేస్తాం" అని తెలిపారు.

ఫుడ్​ మెనూ ఇదే! - హెడ్ చెఫ్ జ్యూస్‌ల గురించి మాట్లాడుతూ- ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో చెరకు రసం, యాపిల్, బీట్ రూట్, క్యారెట్(ఏబీసీ జ్యూస్​) ఏర్పాటు చేస్తారు. అవి వాళ్లు రిఫ్రెష్ గా ఉంచుతాయి. ఇది వారని రీఫ్రెష్ చేస్తుంది. వీటితో పాటుగా ఆవకాడో స్మూతీని కూడా ప్లేయర్లకు అందిస్తాం. ఆర్టిఫీషియల్ ఎనర్జీ డ్రింక్స్, ఇతర ప్రొడక్టులేమీ ఇవ్వకుండా కేవలం జ్యూస్​లను మాత్రమే, అది కూడా పల్ప్ ఫామ్​లోనే అందిస్తాం. ప్లేయర్ల ఆరోగ్యం గురించి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒకవేళ ప్లేయర్​ ఎవరైనా అస్వస్థకు గురైనా, లేదా ఎవరైనా ప్లేయర్ డైట్ ఛార్ట్​లో ఉన్న ఫుడ్ తీసుకోవడం ఇబ్బందిగా ఫీల్ అయితే వారి కోసం లైట్ మీల్​ రెడీ చేస్తాం. మూంగ్ దాల్ కిచిడీ సిద్ధం చేసి ఇస్తాం. భారత్, బంగ్లాదేశ్ ప్లేయర్లు తమ ఇళ్లకు ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్లాలని ఆశిస్తున్నాం." అని వెల్లడించారు.

అయితే ప్లేయర్స్​కు ఆహారం సిద్ధం తమ హోటల్​కు ఇదేం తొలిసారి కాదని, గత కొన్నేళ్లుగా ఎంతో మంది ప్లేయర్స్​ కోసం ఫుడ్ ప్రిపేర్​ చేసి అందిస్తున్నట్లు తెలిపారు బలరాం.

అశ్విన్ సెంచరీ - భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్​ఇండియా అనూహ్యమైన ప్రదర్శన కనబరిచింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ - రవీంద్ర జడేజా క్రీజులో నిలబడి జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. తొలి రోజు లంచ్ సమయానికి 88/3గా ఉన్న స్కోరు ఆట ముగిసే సమయానికి 339/6కు చేరింది. అశ్విన్ (102*) అదిరేలా బ్యాటింగ్ చేసి సెంచరీ చేయగా, చెత్త బంతులను సైతం బౌండరీకి పంపిన జడేజా (86*)తో శేభాష్ అనిపించాడు.

147 ఏళ్లలో తొలిసారి ఇలా - య‌శ‌స్వి జైశ్వాల్​ చారిత్రాత్మక రికార్డ్​ - IND VS BAN Yashasvi Jaiswal

చరిత్ర సృష్టించిన అశ్విన్ ​- వరల్డ్​లో ఏకైక ప్లేయర్​గా రికార్డ్! - Ashwin Test Record

ABOUT THE AUTHOR

...view details