తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగ్లా తొలి టెస్ట్​లో రోహిత్​ శర్మ అరుదైన రికార్డ్​ - తొలి ఆటగాడిగా ఘనత - Rohith Oldest Test Captain Record

IND VS BAN First Test Rohith Sharma 1000 Runs Record : టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్​ శర్మ బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమైనప్పటికీ ఓ అరుదైన రికార్డ్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. పూర్తి వివరాలు స్టోరీలో

source Associated Press
IND VS BAN First Test Rohith Sharma (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Sep 21, 2024, 11:20 AM IST

IND VS BAN First Test Rohith Sharma 1000 Runs Record : టీమ్​ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. క్రికెట్​ అభిమానులను, తన ఫ్యాన్స్​ను నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్​ కలిపి కేవలం 11 పరుగులే చేయగలిగాడు.

అయితే తన ఫ్యాన్స్​ను రోహిత్ నిరాశ పరిచినప్పటికీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది 1000 పరుగులను సాధించాడు. 2024 క్యాలెండర్‌ ఇయర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి హిట్​ మ్యాన్​ ఈ ఫీట్​ను టచ్​ చేశాడు. ఇప్పటివరకు మొత్తం 27 మ్యాచుల్లో 1,001 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు వన్డేల్లో 157 పరుగులు చేయగా, 11 టీ20ల్లో 378 రన్స్​, ఏడు టెస్టుల్లో 466 పరుగులు సాధించాడు.

దీంతో హిట్ మ్యాన్​ అత్యధిక వయసు కెప్టెన్‌గా ఉంటూ ఓ క్యాలెండర్‌ సంవత్సరంలో వెయ్యికి పైగా రన్స్​ చేసిన తొలి ఆటగాడిగా ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ వయసు 37 ఏళ్ల 144 రోజులు.

ఆ జాబితాలో ఐదో స్థానం(Rohith Sharma Record) - మొత్తంగా ఒక క్యాలెండర్ ఇయర్​లో 1000కుపైగా పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్​లో కెప్టెన్​ రోహిత్ శర్మ ఐదో స్థానంలో నిలిచాడు. లంక బ్యాటర్ పాథున్ నిస్సాంక 24 మ్యాచుల్లో 1,164 పరుగులు చేసి అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. కుశా మెండిస్ 33 మ్యాచుల్లో 1,161 రన్స్, యశస్వి జైస్వాల్ 1,099 పరుగులు, కమిందు మెండిస్‌ 1,028 పరుగులు చేసి రోహిత్ కన్నా ముందు స్థానాల్లో నిలిచారు.

IND VS BAN Yashasvi Jaiswal :టీమ్​ ఇండియా యంగ్ ప్లేయర్​ యశస్వి జైస్వాల్‌ కూడా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. పది టెస్టుల్లోనే 1000కిపైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. ప్రస్తుతం అతడు 10 టెస్టుల్లో 1,094 పరుగులు సాధించాడు. కాగా, ఈ కథనం రాసే సమయానికి ఈ మ్యాచ్​లో టీమ్ ఇండియా లీడింగ్​లో కొనసాగుతోంది.

దేశ‌వాళీ క్రికెట్‌లోకి హార్దిక్​ - మ‌ళ్లీ ఆ జెర్సీ వేసుకునేందుకు ప్లాన్​! - Hardik Pandya Test Cricket

చరిత్ర సృష్టించిన అఫ్గానిస్థాన్​ - తొలిసారి వన్డే సిరీస్ కైవసం - Afghanistan vs South Africa

ABOUT THE AUTHOR

...view details