IND VS BAN First Test Rishabh Pant Litton Das Argument :బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన తొలి టెస్ట్‌లో టీమ్ ఇండియా ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో కేవలం 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమ్ఇండియా. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్, పంత్ భారత జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే యశస్వి కొనసాగినా పంత్(39) ఔట్ అయిపోయాడు. ఈ క్రమంలోనే పంత్ క్రీజులో ఉన్నప్పుడు అతడి కాన్సన్‌ట్రేషన్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో గొడవకు దిగాడు బంగ్లా వికెట్ కీపర్ లిట్టన్ దాస్!
అసలేం జరిగిందంటే? - బంగ్లాదేశ్ బౌలర్ టస్కిన్ అహ్మద్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఈ వివాదం చోటు ఫీల్డర్ త్రో విసిరిన బంతి పంత్ ప్యాడ్‌కు తగిలి మిడ్ వికెట్ వైపు వెళ్లింది. దీంతో పంత్ ఎక్స్‌ట్రా రన్ కోసం ట్రై చేశాడు. కానీ, జైస్వాల్ నో చెప్పడం వల్ల క్రీజులోకి తిరిగి వచ్చేశాడు.
అయితే బంగ్లా కీపర్ లిట్టన్ దాస్ మాత్రం దానికి రన్ ఎలా తీస్తావ్ అంటూ పంత్‌కు ఏదో చెప్పబోయాడు. మరి బాల్ వికెట్లకు తగిలేలా సంధించండి, నన్నేందుకు కొడుతున్నారు అంటూ పంత్ రివర్స్ కౌంటర్ వేశాడు. అలా కొద్ది సేపు ఇద్దరి మధ్య మాటలు నడిచాయి.