IIND vs BAN Test 2024:భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ శతకం (102 పరుగులు)తో అదరగొట్టాడు. అతడు 108 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో అశ్విన్ తన అశ్విన్ టెస్టు కెరీర్లో 6వ శతకం పూర్తి చేశాడు. మరోవైపు జడేజా (86 పరుగులు; 10x4 , 2x6) కూడా బాధ్యాతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ 339-6 (80 ఓవర్లు) స్కోర్‌తో పటిష్ఠ స్థితికి చేరుకుంది. క్రీజులో అశ్విన్, జడేజా ఉన్నారు.
ఆదుకున్న అశ్విన్, జడ్డూ
144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడ్డ టీమ్ఇండియాను జడేజా, అశ్విన్ ఆదుకున్నారు. స్కోర్ 200 అయినా దాటుతుందా అన్న దశలో నుంచి భారత్‌కు 300+ స్కోర్ అందించారు. వీరిద్దరూ వీరిద్దరూ 7వ వికెట్‌కు భారీ 195 పరుగులు అజేయ భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కు భారీ స్కోర్ అందించారు. రోహిత్, గిల్, విరాట్ లాంటి స్టార్లు ఈ పిచ్‌పై పరగులు చేయడానికి కష్టపడితే ఈ ఆల్‌రౌండర్లు భారీ స్కోర్లతో బంగ్లా బౌలర్లకు ఎదురు నిలిచారు. ఎలాంటి ప్రయోగాత్మక షాట్లకు పోకుండా నిలకడతా ఆడారు. ఈ క్రమంలోనే అశ్విన్ శతకం పూర్తి చేశాడు. కాగా, తన హోం గ్రౌండ్ చెపాక్‌లో అశ్విన్‌కు ఇది రెండో టెస్టు సెంచరీ.