తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ x ఆస్ట్రేలియా ఫైనల్- తేల్చుకోవాల్సిన లెక్కలెన్నో- ఈసారి దెబ్బ కొట్టాల్సిందే! - ind vs aus icc fnals

Ind vs Aus U-19 Final 2024: భారత్- ఆస్ట్రేలియా మధ్య ఏడాదిలో మూడోసారి ఐసీసీ ఫైనల్ ఈవెంట్ జరగనుంది. ఇదివరకు జరిగిన రెండింట్లోనూ ఆసీస్ టైటిల్ ఎగరేసుకుపోయింది. దీంతో ఈసారి ఆస్ట్రేలియాను ఎలాగైన దెబ్బకొట్టి భారత్​ ఛాంపియన్​గా నిలవాలని టీమ్ఇండియా ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు.

Ind vs Aus U-19 Final 2024
Ind vs Aus U-19 Final 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 7:46 AM IST

Updated : Feb 9, 2024, 11:40 AM IST

Ind vs Aus U-19 Final 2024:2024 అండర్-19 వరల్డ్​కప్​ ఫైనల్​లో భారత్- ఆస్ట్రేలియా ఢీకొట్టనున్నాయి. ఫిబ్రవరి 11న సౌతాఫ్రికా బినోని స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక గత ఏడాదికాలంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య ఇది మూడో ఐసీసీ ఫైనల్ ఈవెంట్ కావడం విశేషం. గత రెండు ఈవెంట్​ (డబ్ల్యూటీసీ 2023, వన్డే వరల్డ్​కప్ 2023)ల్లోనూ ఆసీస్ గెలుపొంది భారత్​కు నిరాశ మిగిల్చింది. దీంతో ఈసారైనా యువ భారత్ ప్రత్యర్థి ఆసీస్​ను మట్టికరిపించాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

హిస్టరీ మనవైపే:ఈ టోర్నమెంట్​లో భారత్ ఒక్క మ్యాచ్​లో కూడా ఓడిపోకుండా తొమ్మిదోసారి ఫైనల్​ చేరింది. మరోవైపు అండర్​19 వరల్డ్​కప్​లో ఆసీస్ ఆరోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే అండర్​19 టోర్నీలో ఆసీస్​పై టీమ్ఇండియాకు ఘనమైన రికార్డే ఉంది. గతంలో టీమ్ఇండియా రెండుసార్లు ఫైనల్​లో (2012, 2018) ఆసీస్​తో పోటీపడింది. రెండింట్లోనూ భారత్​ విజయం సాధించి ఛాంపియన్​గా నిలిచింది. ఇది భారత్​కు కాస్త ఊరటనిచ్చే విషయం. ఇక మరోసారి ఆసీస్​తో పోరుకు యువ భారత్ రెడీ అవుతోంది.

ఎవరేం తక్కువకాదు:ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్​ కూడా ఓడకుండా ఫైనల్స్​కు చేరింది. లీగ్​ దశలో ఆరు మ్యాచ్​లు ఆడిన భారత్, అన్నింట్లోనూ విజయం సాధించింది. అటు ఆస్ట్రేలియాది కూడా ఇదే పరిస్థితి. వాళ్లు కూడా ఓటమి ఎరుగకుండా తుదిపోరుకు అర్హత సాధించారు. దీంతో ఇరుజట్ల మధ్య పోరు గట్టిగానే ఉంటుందనడానికి ఎలాంటి సందేహం లేదు.

మ్యాచ్ గురించి మరిన్ని

  • మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం?
    ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 1.00 (IST) గంటలకు టాస్, 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
  • మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
    ఈ వరల్డ్​కప్ టోర్నీకి సౌతాఫ్రికా ఆతిథ్యం ఇస్తోంది. ఫైనల్ మ్యాచ్​కు విల్లోమూరె పార్క్​ బినోని స్టేడియం వేదిక కానుంది.
  • లైవ్ ఎక్కడ చూడవచ్చు?
    బ్రాడ్​కాస్టింగ్​లో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్​లో చూడవచ్చు. ఇక మొబైల్​లో అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్​లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

అండర్​ 19 వరల్డ్ కప్​లో ట్విస్ట్ - ఫైనల్‌కు ఆసీస్‌ x భారత్‌ ఢీ

అండర్ -19 వరల్డ్ కప్​ : పాకిస్థాన్​ గెలవాలని కోరుకుంటున్న భారత్ ఫ్యాన్స్!

Last Updated : Feb 9, 2024, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details