తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ x ఆస్ట్రేలియా - స్టార్క్‌ దెబ్బకు 180కే టీమ్ఇండియా ఆలౌట్! ​ - IND VS AUS BORDER GAVASKAR TROPHY

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సెకెండ్ టెస్ట్​ తొలి ఇన్నింగ్స్​లో 180కే టీమ్ఇండియా ఆలౌట్! ​

IND VS AUS BORDER GAVASKAR TROPHY
IND VS AUS BORDER GAVASKAR TROPHY (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Dec 6, 2024, 2:31 PM IST

IND Vs AUS Border Gavaskar Trophy 2nd Test : బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు (పింక్ బాల్​) తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 180 పరుగులకు ఆలౌట్ అయింది. యంగ్ బ్యాటర్ నితీశ్‌ రెడ్డి (42) టాప్ స్కోరర్​గా నిలిచాడు. కేఎల్‌ రాహుల్‌ 37, శుభ్‌మన్‌ గిల్‌ 31, అశ్విన్ 22, రిషభ్‌ పంత్ 21 పరుగులు మాత్రమే చేశారు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్​ (6/48) దెబ్బకు భారత టాప్ ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 6 వికెట్లతో పాటు బోలాండ్‌, కమిన్స్‌ చెరో 2 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక యశస్వి, హర్షిత్, బుమ్రా డకౌట్‌ కాగా, విరాట్ కోహ్లీ 7, రోహిత్ 3 విఫలమయ్యారు. సిరాజ్‌ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మ్యాచ్ ఎలా సాగిందంటే? -ఈ గులాబీ టెస్టులో టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్ ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్​ యశస్వి జైస్వాల్ గోల్డెన్ డక్​గా వెనుదిరిగాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది.

మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ తొలి బాల్​కే ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31) జట్టును ఆదుకున్నారు. ఇద్దరు రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

రాహుల్, గిల్ వేగంగా పరుగులు చేస్తున్న సమయంలోనే స్టార్క్‌ మరోసారి బౌలింగ్‌కు వచ్చి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను దెబ్బ తీశాడు. హాఫ్ సెంచరీకి దగ్గరైన రాహుల్‌(37)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అలా ముందుగా కేఎల్‌ రాహుల్​ను ఔట్ చేసిన స్టార్క్, ఆ తర్వాత విరాట్‌ కోహ్లీ (7)ను పెవిలియన్ పంపాడు.

అనంతరం బోలాండ్‌ బౌలింగ్‌లో గిల్ ఎల్బీగా అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ (3) నిరాశపర్చగా. రిషభ్​ పంత్ కూడా (21) కీలక సమయంలో ఔట్​ అయ్యాడు. అశ్విన్ (22) పర్వాలేదనిపించాడు. అలా ఓ వైపు వికెట్స్ పడుతున్నప్పటికీ, నితీశ్‌ రెడ్డి ధాటిగా ఆడడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది.

హ్యారీ బ్రూక్ @ 1000 టెస్ట్ పరుగులు! - జోరూట్, జైస్వాల్ తర్వాత ఇతడే!

ఆ కారణంగా మా నాన్న ఏడ్చిన రోజులు చూశాను - అప్పుడే క్రికెట్​పై ఫోకస్ పెట్టాను : నితీశ్ కుమార్

ABOUT THE AUTHOR

...view details