Ind vs Aus 2nd Test :అడిలైడ్ వేదికగా భారత్- ఆస్ట్రేలియాతో మధ్య జరుగుతున్న డే/నైట్ టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట పూర్తయ్యే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 94 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 86-1. క్రీజులో నాథన్ మెక్స్వీనే (38 పరుగులు), మార్నస్ లబుషేన్ (20 పరుగులు) ఉన్నారు. భారత బౌలర్లలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడికే తొలి రోజు వికెట్ దక్కింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులుకే ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (42; 54 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (37; 64 బంతుల్లో, 6 ఫోర్లు), శుభ్మన్ గిల్ (31; 51 బంతుల్లో, 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (22; 22 బంతుల్లో, 3 ఫోర్లు), రిషభ్ పంత్ (21; 35 బంతుల్లో, 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
విఫలం
కెప్టెన్ రోహిత్ శర్మ (3 పరుగులు), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (7 పరుగులు) నిరాశ పర్చారు. యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ (0) పరుగుల ఖాకా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో విజృంభించాడు. ప్యాట్ కమిన్స్ , స్కాట్ బొలాండ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.