Womens T20 World Cup 2024 IND VS SL :మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తాజా మ్యాచ్‌లో టీమ్ ఇండియా భారీ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ పోరులో 82 పరుగులు తేడాతో గెలుపొందింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. 19.5 ఓవర్లలో 90 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
లంక బ్యాటర్లలో కవషా దిల్హరి(21; 22 బంతుల్లో 1 ఫోరు), అనుష్క సంజీవని(20; 22 బంతుల్లో 2 పోర్లు), అమ కాంచనా(19) నామమాత్రపు పరుగులు చేయగా, మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. భారత మహిళా బౌలర్లలో అరుంధతి రెడ్డి, ఆషా శోభాన తలో మూడు వికెట్లు పడగొట్టగా, రేనుకా ఠాకూర్ సింగ్ 2 వికెట్లు తీసింది. శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ తలో వికెట్ వికెట్ పడగొట్టారు.