World Test Championship Points Table : మ్యాచ్‌లు జరుగుతోన్న కొద్ది డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక ఆసక్తికరంగా మారుతోంది. మొదటి రెండు స్థానాల కోసం ఆయా జట్ల మధ్య హోరాహోరీ పోరు గట్టిగా కొనసాగుతోంది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీని ఘనంగా ప్రారంభించిన భారత జట్టు టాప్ 1లోకి వెళ్లింది. అయితే పింక్ బాల్ టెస్టులో మాత్రం ఘోర పరాజయాన్ని అందుకోవడంతో మూడో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. ఇంకా మరో మూడు మ్యాచులు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో టీమ్ ఇండియా అగ్రస్థానంలోకి చేరడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. దానికి సమీకరణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్ట్రేలియాతో (India vs Australia) జరగబోయే మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ టీమ్ ఇండియా గెలుపొందాలి. అప్పుడు 64.04 శాతంతో టీమ్ ఇండియా ముందుకెళ్తుంది. ఆస్ట్రేలియా 55.26 శాతం కన్నా ఎక్కువ సాధించలేదు.
దీంతో అగ్రస్థానం కోసం భారత జట్టుకు పోటీ సౌతాఫ్రికా మాత్రమే. ప్రస్తుతం ఆ జట్టు 63.33 శాతంతో నెం.1 స్ధానంలో కొనసాగుతోంది.
సౌతాఫ్రికా తన తదుపరి రెండు మ్యాచ్‌లను పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌ను 1-1తో ముగిస్తే, ఆ జట్టు ఖాతాలో 61.11 శాతం పాయింట్లు ఉంటాయి.
ఒక వేళ సౌతాఫ్రికా 2-0 తేడాతో పాకిస్థాన్‌ను ఓడిస్తే, భారత జట్టు అగ్రస్థానం దక్కదు. 69.44 శాతంతో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలోకి వెళ్తుంది.