తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత కామెంటేటర్‌లకే ఎక్కువ ఇన్‌కమ్‌! ఒక్క మ్యాచ్​కు ఎంత సంపాదిస్తారంటే? - Cricket Commentators Salary

Cricket Commentators Salary : ఇండియాలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో కామెంటేటర్లు కూడా పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. వారి ఇన్‌కమ్‌ ఎలా ఉంటుందంటే?

Cricket Commentators Salary
Cricket Commentators Salary (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Sep 17, 2024, 9:37 PM IST

Cricket Commentators Salary : సినిమాలకు మాటలెంత ముఖ్యమో క్రికెట్‌కు కామెంటరీ అంత ముఖ్యం. రేడియోలో క్రికెట్‌ కామెంటరీ వినే రోజులే కాదు, ప్రస్తుతం లైవ్‌ చూస్తున్నప్పుడు కూడా కామెంటరీ క్రికెట్‌ మజాను పెంచుతుంది. క్రికెట్ కామెంటరీ గేమ్‌కి ఎక్సైట్‌మెంట్‌, ఎమోషన్‌ను తీసుకొస్తుంది. ఒక మంచి కామెంటేటర్‌ ఏం జరిగిందే వివరించడమే కాదు, గేమ్‌ని స్పష్టంగా అర్థం చేసుకునేలా చేస్తాడు.

ఉత్తమ కామెంటేర్‌లు వేగంగా ఆలోచిస్తారు, గేమ్‌లో ఎలాంటి పరిస్థితినైనా నిర్వహించడానికి సిద్ధంగా ఉంటారు. గత నాలుగు దశాబ్దాలుగా టోనీ గ్రేగ్, రిచీ బెనాడ్, రవిశాస్త్రి, హర్షా భోగ్లే వంటి దిగ్గజ కామెంటేటర్‌లు క్రికెట్‌ అభిమానులను అలరిస్తున్నారు. వీరు అన్ని ప్రధాన మ్యాచ్‌లు, సిరీస్‌లు, టోర్నీలకు సేవలు అందిస్తున్నారు. మరి వీళ్ల ఆదాయం ఎంత ఉంటుందో తెలుసా?

భారతదేశంలో క్రికెట్ కామెంటేటర్‌ల పెరుగుదల!
భారతదేశంలో క్రికెట్‌ను ఓ క్రీడకంటే ఎక్కువగా చూస్తారు. కోట్ల మంది క్రికెట్‌ను క్రమం తప్పకుండా ఫాలో అవుతారు. ఈ పాపులారిటీతోనే బ్రాడ్‌కాస్టర్‌ల కోసం భారీ మొత్తంలో స్పాన్సర్‌షిప్, బ్రాండ్ మనీ వెల్లువెత్తుతోంది. దీంతో భారతీయ క్రికెట్ కామెంటేటర్‌లు ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే స్పోర్ట్స్‌ కామెంటేటర్‌లుగా నిలిచారు. ప్రముఖ హిందీ క్రికెట్ కామెంటేటర్‌ ఆకాష్ చోప్రా ఇటీవల, భారత క్రికెట్ కామెంటేటర్‌ల సంపాదన గురించి ఆసక్తికరమన విషయాలు షేర్‌ చేసుకున్నారు.

క్రికెట్ కామెంటేటర్‌ల సంపాదన ఎంత?
భారత్​లో ఒక జూనియర్ క్రికెట్ కామెంటేటర్‌ రోజుకు సుమారు రూ.35,000 సంపాదించవచ్చు. అదే ఉన్నత స్థాయి, అనుభవం ఉన్న కామెంటేటర్‌ అయితే రోజుకు రూ.6 నుంచి రూ.10 లక్షల మధ్య సంపాదించవచ్చు. వారి జీతంతో పాటు, పెద్ద సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్న కామెంటేటర్‌లు ప్రకటనలు, ప్రమోషన్‌ల కోసం ఆయా బ్రాండ్‌లతో కలిసి పని చేయడం వల్ల అదనపు ఆదాయం పొందవచ్చు.

ఐపీఎల్‌, భారత్ మ్యాచ్‌లకు డిమాండ్‌
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), భారత్ ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ల సమయంలో కామెంటేటర్‌ల ఆదాయం పెరుగుతుంది. ఈ ఈవెంట్‌ల సమయంలో టాప్‌ కామెంటేటర్‌లు భారీ మొత్తంలో సంపాదిస్తారు. ఉదాహరణకు హర్షా భోగ్లే 2008 నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లకు తన కామెంటరీ అందిస్తున్నాడు. రవిశాస్త్రి కూడా 2008 నుంచి ఐపీఎల్‌ కామెంటరీ చేస్తున్నాడు. భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎన్నికయ్యాక 2017 నుంచి కొంత కాలం కామెంటరీకి దూరంగా ఉన్నాడు. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ మూడు దశాబ్దాలకు పైగా కామెంటరీ అందిస్తున్నాడు. 2008లో ప్రారంభ సీజన్ నుంచి IPL కామెంటేటరీ టీమ్‌లో కొనసాగుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details