తెలంగాణ

telangana

ETV Bharat / sports

హార్దిక్‌ పాండ్యకు ఊరట - 'రంజీల్లో ఆడాల్సిన అవసరం లేదు' - రంజీ ట్రోఫీ గురించి బీసీసీఐ

Hardik Pandya Ranji Trophy :భారత క్రికెటర్లకు ఇటీవలే బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రంజీల్లో తమ రాష్ట్ర జట్టు తరఫున ఆడాలని ఆటగాళ్లను బీసీసీఐ తెలిపింది. అయితే ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు మాత్రం అలాంటి ఆదేశాలు ఇంకా రాలేదు. ఎందుకంటే ?

Hardik Pandya Ranji Trophy
Hardik Pandya Ranji Trophy

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 10:09 PM IST

Hardik Pandya Ranji Trophy : ప్రస్తుతం నేషనల్​ జట్టులో లేని ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడాలంటే కచ్చితంగా కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడాలనే ఆలోచనను బీసీసీఐ తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐపీఎల్‌- 2024 కోసం ప్రాక్టీస్​కు దిగిన కృనాల్‌ పాండ్య, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ చాహర్‌ లాంటి ఆటగాళ్లను రంజీల్లో పాల్గొనాలని ఇప్పటికే కోరింది. అయితే స్టార్ ఆల్​రౌండర్​ హార్దిక్‌ పాండ్యాకు మాత్రం అలాంటి ఆదేశాలు రాలేదట. ఇటీవలే దీనిపై బీసీసీఐ అధికారులను ప్రశ్నించగా వాళ్లు ఈ మేరకు స్పందించారు.

"హార్దిక్‌ పాండ్య రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడలేడు. అయితే అతడి శరీరం ఇప్పుడు టెస్టు క్రికెట్‌ భారాన్ని మోయలేదు. అందుకే ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ ఇండియాకు అతడి అవసరం ఉంది." అని బీసీసీఐకు చెందిన అధికారి అన్నారు. అయితే ఝార్ఖండ్‌ ప్లేయర్​ ఇషాన్‌ కిషన్‌ రంజీల్లో పాల్గొనకుండా ఐపీఎల్‌ కోసం సాధన చేయడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బోర్డు పలు మార్పులు చేయడానికి సిద్ధమైంది.

"కొంత మంది యువ ఆటగాళ్లను పిలిచిన సమయంలో రాకుండా ఫిజియో వర్క్‌లో ఉన్నామని, ఇతర కారణాలు చెబుతున్నారు. ఇది ఎక్కడో ఒక చోట ఆగాలి. కానీ, ఇంకొందరు ప్లేయర్లు కచ్చితంగా రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడనవసరం లేదని బీసీసీఐకి తెలుసు. వారికి మాత్రం మినహాయింపు ఉండే అవకాశముంది" అని ఆ అధికారి అన్నాడు.

Ishan Kishan BCCI :ఇప్పుటి ప్లేయర్లలో కొంత మంది రంజీలు ఆడేందుకు విముఖ‌త చూపిస్తున్నారు. కేవలం అంత‌ర్జాతీయ మ్యాచులు, ఐపీఎల్ మాత్ర‌మే ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అలాంటి ప్లేయర్స్​ను కంట్రోల్ చేసేందుకు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చేలా నిర్ణయం తీసుకుంది. భారత జట్టులో(పర్యటనలో) లేనివాళ్లు ఐపీఎల్​లో ఆడాలంటే అంతకన్నా ముందు ప్లేయర్స్​ అంద‌రూ కచ్చితంగా రంజీ ట్రోఫీ మూడు, నాలుగు మ్యాచులు ఆడేలా బోర్డు ప్రణాళిక రచిస్తోంది.

అసలేం జరిగిందంటే ? గ‌తేడాది డిసెంబ‌ర్‌ నుంచి ఇషాన్ కిష‌న్ ఆట‌కు దూరంగా ఉంటున్నాడన్న సంగతి తెలిసిందే. ద‌క్షిణాఫ్రికా టూర్​కు వెళ్లిన అత‌డు మాన‌సిక స‌మ‌స్య‌లు అంటూ స్వ‌దేశానికి తిరిగి వచ్చేశాడు. రీసెంట్​గా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల‌కు అత‌డిని సెల‌క్ట‌ర్లు తీసుకోలేదు. ఈ విష‌యమై కోచ్ ద్ర‌విడ్‌కు ప్రశ్న ఎదురైంది. టీమ్ఇండియాలోకి రావాలంటే ఎవ‌రైనా స‌రే కచ్చితంగా దేశ‌వాళీ క్రికెట్​ ఆడాల్సి ఉంటుంద‌ని ద్రవిడ్ పేర్కొన్నాడు.

అందుకే రోహిత్‌ స్థానంలో హార్దిక్‌ - అసలు కారణం చెప్పేసిన ముంబయి ఇండియన్స్‌

పాండ్యకు అంబానీల మర్యాద- గుర్రాలు, బ్యాండ్​ బాజాతో MI కెప్టెన్​కు గ్రాండ్ వెల్​కమ్

ABOUT THE AUTHOR

...view details