Harbhajan Singhs Strong Counter To Pakistan : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తాజాగా మరోసారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మండిపడ్డారు.ఇష్టం లేకపోతే భారత్‌కు రావొద్దని, ఇందులో తమకు ఎటువంటి బాధ లేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పటికే ఆ దేశంలో భారత్ పర్యటించేది లేదని, హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. అయితే మొన్నటివరకు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించడానికి అస్సలు ఒప్పుుకోని పాక్ ఇప్పుడు హైబ్రిడ్ పద్ధతికి అంగీకరిస్తామని పేర్కొంది. కానీ ఓ ట్విస్ట్ కూడా ఇచ్చింది. ఫ్యూచర్లో పాకిస్థాన్ టీమ్ కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్‌కు వెళ్లబోమని, ఆ మ్యాచ్‌లను కూడా తటస్థ వేదికల్లో నిర్వహించేలా తమకు హామీ ఇవ్వాలంటూ పీసీబీ పేర్కొంది.
"మీకు ఇష్టం లేకుంటే భారత్‌కు రావొద్దు. ఈ విషయంలో మాకు ఎటువంటి బాధ లేదు. పాకిస్థాన్ టీమ్ భారత్‌కు రాకపోతే ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. మీరు ప్రస్తుత క్రికెటర్లను అడిగినా సరే వారు కూడా ఇదే విషయం చెబుతారు. పాక్‌లో పరిస్థితి భిన్నంగా ఉంటే, ఈ విషయంలో భారత్ తీరు వేరేవిధంగా ఉండేది. మొండి వైఖరిని వదిలేసి ఈ టోర్నమెంట్‌ను జరగనివ్వండి. మీరు దాన్ని ఎలాగో ఆపలేరు. శ్రీలంక, మలేసియాతో పాటు ఇతర దేశాలు ఆతిథ్యం ఇవ్వడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నాయి. పాకిస్థాన్‌లో పరిస్థితులు నార్మల్గా అయ్యేంతవరకూ టీమ్ఇండియా అక్కడకి రాదు." అని హర్భజన్ పాక్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.