ETV Bharat / sports

'పెళ్లైన తర్వాత బ్యాడ్మింటన్‌ కంటిన్యూ చేస్తాను - ఇప్పటికీ రోజూ ప్రాక్టీస్ చేస్తున్నా' - PV SINDHU SPECIAL INTERVIEW

పీవీ సింధు స్పెషల్ ఇంటర్వ్యూ - పెళ్లి, కెరీర్​ గురించి ఏం చెప్పిందంటే?

PV SINDHU SPECIAL INTERVIEW
PV Sindhu (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 4, 2024, 6:55 AM IST

PV Sindhu About Marriage : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తాజాగా తన పెళ్లి అలాగే కెరీర్​ గురించి మాట్లాడింది. పారిస్‌ ఒలింపిక్స్‌ ముగియగానే వివాహం చేసుకుందామని భావించినట్లు తెలిపింది. వరుస టోర్నీలతో టైమ్​ లేకుండా ఉండటం వల్ల పెళ్లి ఆలస్యమైందని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయిను వివాహమాడనున్న సింధు తాజాగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పిన పలు ముచ్చట్లు ఆమె మాటల్లోనే.

వారిద్దరి బ్లెస్సింగ్స్​తోనే
లైఫ్​లో ఓ కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మా అమ్మ, నాన్న కష్టం వల్లనే నేను బ్యాడ్మింటన్‌లో ఈ పొజిషన్​కు చేరుకున్నాను. ఇప్పుడు వాళ్లిద్దరి బ్లెస్సింగ్స్​తోనే ఈ పెళ్లి చేసుకోనున్నాను. నా జీవితంలో ఎంతో అపురూపమైన సందర్భం ఇది. రెండు ఫ్యామిలీస్​ మధ్య ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఒలింపిక్స్‌ అవ్వగానే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ తీరిక లేని షెడ్యూల్‌ వల్ల అది కుదరలేదు.

అయితే జనవరి నుంచి మళ్లీ టోర్నీలు ఉన్నాయి. దీంతో పెళ్లికి డిసెంబరు 22ను సరైన రోజుగా భావించాం. నెల రోజుల ముందే ఈ వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాల నుంచి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పుర్‌లో పెళ్లి వేడుకలు జరగనున్నాయి. అక్కడైతే కాస్త ప్రైవసీ ఉంటుంది. ఇక 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఉంటుంది. ఆ రోజు అందరినీ ఇన్వైట్ చేయాలని నిర్ణయించుకున్నాం.

నా మ్యాచ్‌లన్నీ చూస్తారు
వెంకట్‌ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయనకు ఓ కంపెనీ ఉంది. దాన్ని నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఇక నా షెడ్యూల్‌ కూడా తీరిక లేకుండానే ఉంటుంది. అందుకే మేమిద్దరం చాలా తక్కువ సార్లే కలిశాం. వెంకట్‌ బ్యాడ్మింటన్‌ ఆడరు. కానీ నా మ్యాచ్‌లన్నీ చూస్తారు. బ్యాడ్మింటన్‌ను ఫాలో అవుతారు. స్పోర్ట్స్ అంటే ఇష్టం. కానీ బిజినెస్​ వైపు వెళ్లారు. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్, డేటా సైన్స్‌ కోర్స్​లను పూర్తి చేశారు. ప్రస్తుతం సొంత కంపెనీ పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌కు ఆయన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

అదే నా లక్ష్యం
పెళ్లైన తర్వాత కూడా బ్యాడ్మింటన్‌ కంటిన్యూ చేస్తాను. గాయాలకు దూరంగా ఉంటూ ఫిట్‌నెస్​ను కాపాడుకోవడమే నా మెయిన్ గోల్. పెళ్లి కుదిరిన తర్వాత కూడా నేను ఎప్పుడూ ప్రాక్టీస్‌ మానలేదు. మంగళవారం కూడా సాధన చేశాను. ఉదయ్‌పుర్‌కు వెళ్లే వరకూ ఈ ప్రాక్టీస్‌ ఇలాగే కొనసాగుతుంది. అయితే పెళ్లయ్యాక కొన్ని రోజులకు మళ్లీ ప్రాక్టీస్​ మొదలుపెడతాను.

జనవరి నుంచి కొత్త సీజన్‌ స్టార్ట్ కానుంది. అందుకోసం చాలా ప్రిపేర్డ్​గా ఉండాలి. రానున్న సీజన్‌ నాకు ఎంతో కీలకం. వరుసగా టోర్నీలు ఉన్నాయి. అన్ని మెయిన్ టోర్నీల్లో బరిలో దిగాలని నేను భావిస్తున్నాను. సయ్యద్‌ మోదీ సూపర్‌ 300 టైటిల్‌తో నా కాన్ఫిడెన్స్​ పెరిగింది. సరైన టైమ్​లోనే ఈ విజయం లభించిందని అనుకుంటున్నాను. మళ్లీ లయను దొరకబుచ్చుకున్నాను. ఫిట్‌గా ఉంటే 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లోనూ ఆడతాను. గాయాలు కాకుండా మంచి ఫిట్‌నెస్‌తో ఉంటే అదేమీ కష్టం కాదు.

ఆటలపై ఆసక్తి
సింధుకు కాబోయే భర్త సాయి వెంకట దత్తా బ్యాడ్మింటన్‌ ఆడరు కానీ ఆయనకు ఆటలపై బాగానే ఆసక్తి ఉంది. మోటార్‌ స్పోర్ట్స్‌లో తనకు ప్రవేశం ఉంది. డర్ట్‌ బైకింగ్, మోటార్‌ ట్రెక్కింగ్‌లో తరచూ పాల్గొంటుంటారు. తన దగ్గర డజను సూపర్‌ బైక్స్‌తో పాటు కొన్ని స్పోర్ట్స్‌ కార్లూ ఉన్నాయి.

తన తండ్రి గౌరెల్లి వెంకటేశ్వరరావు ఇన్​కమ్​ట్యాక్స్ డిపార్ట్​మెంట్​లో మాజీ అధికారి. ప్రస్తుతం సాయి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న ప్రోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థను ఆయనే నెలకొల్పారు. సాయి తల్లి లక్ష్మి. ఆమె తండ్రి భాస్కరరావు హైకోర్టు జడ్జిగా పదవీ రిటైర్ అయ్యారు. భాస్కరరావు అన్న ఉజ్జిని నారాయణరావు సీపీఐ పార్టీ తరఫున నల్గొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యేగా సేవలు అందించారు. జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ (జేఎస్‌డబ్ల్యూ)తో ప్రొఫెషనల్‌ కెరీర్‌ను ప్రారంభించిన సాయి, జేఎస్‌డబ్ల్యూ సహ యజమానిగా ఉన్న దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు వ్యవహారాల్ని చూసుకున్నారు.

పెళ్లి పీటలెక్కనున్న స్టార్ షట్లర్ - రాజస్థాన్​లో పీవీ సింధు వివాహం

సింధు ఈజ్ బ్యాక్- 2022 తర్వాత తొలి టైటిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.