తెలంగాణ

telangana

ETV Bharat / sports

గుజరాత్ టైటాన్స్​కు మరో షాక్​ - ఆ జట్టు ప్లేయర్​కు రోడ్డు ప్రమాదం! - Robin Minz Road Accident

Gujarat Titans Robin Minz Road Accident : ఐపీఎల్‌ 2024 ప్రారంభం అవ్వకముందే గుజరాత్ టైటాన్స్​కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ప్లేయర్ తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

గుజరాత్ టైటాన్స్​కు మరో షాక్​ - ఆ జట్టు ప్లేయర్​కు రోడ్డు ప్రమాదం!
గుజరాత్ టైటాన్స్​కు మరో షాక్​ - ఆ జట్టు ప్లేయర్​కు రోడ్డు ప్రమాదం!

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 5:32 PM IST

Updated : Mar 3, 2024, 9:53 PM IST

Gujarat Titans Robin Minz Road Accident : ఐపీఎల్‌ 2024 ప్రారంభం అవ్వకముందే గుజరాత్ టైటాన్స్​కు మరో షాక్ తగిలింది. మినీ వేలంలో రూ.3.60 కోట్లు దక్కించుకుని అందరి దృష్టి ఆకర్షించిన గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేయర్ రాబిన్‌ మింజ్‌. ఇతడు తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మరో వాహనం ఢీకొంది. దీంతో అతడికి గాయాలయ్యాయని తన తండ్రి ఫ్రాన్సిస్‌ మింజ్‌ తెలిపారు. గాయం మరీ తీవ్రమైంది కాదని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంలో అతడి వాహనం ధ్వంసం అవ్వగా, మోకాలికి గాయాలయ్యాయి. కాగా, ఇటీవలే సర్జరీ కారణంగా ఈ ఐపీఎల్ సీజన్​కు షమీ దూరమైన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాకు చెందిన రాబిన్‌ మింజ్‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్​ (ఐపీఎల్‌)లో ఆడనున్న తొలి గిరిజన క్రికెటర్‌గా రాబిన్​ నిలవడం విశేషం. ఎడమచేతి వాటం కలిగిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దేశవాళి టోర్నీల్లో దూకుడుగా ఆడేవాడు. అలా తన అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. మాజీ కెప్టెన్‌ ధోనీకి కెరీర్‌ ప్రారంభంలో శిక్షణ ఇచ్చిన చంచల్‌ భట్టాచార్యనే(Dhoni Coach) రాబిన్​ మింజ్​కు కూడా శిక్షణ ఇస్తున్నారు.

Robin Minz Career :అయితే ఐపీఎల్‌ 2023 సీజన్​ వేలంలో రాబిన్‌ మింజ్​ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అతడి కోసం ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అప్పుడు నిరాశకు గురయ్యాడు. అయినా మళ్లీ పట్టుదలతో ఈ సీజన్ ఆక్షన్​లో నిలిచాడు. అయితే అతడి కోసం ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్​, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్​, దిల్లీ క్యాపిటల్స్​, కోల్‌కతా నైట్​ రైడర్స్​ జట్లు పోటీ పడ్డాయి. చివరికి గుజరాత్‌ టైటాన్స్ టీమ్​ భారీ ధరకు అతడిని కొనుగోలు చేసింది. మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప అయితే అతడిని ఎడమ చేతి వాటం పోలార్డ్‌ అంటూ ప్రశంసలు కూడా కురిపించాడు.

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్​?​ - కెప్టెన్‌ కూల్‌ చైల్డ్​హుడ్ ఫ్రెండ్​ ఏమన్నాడంటే?

పదో వికెట్​కు రికార్డ్​ పార్ట్​నర్​షిప్​ - టాప్ 10 జోడీలివే!

Last Updated : Mar 3, 2024, 9:53 PM IST

ABOUT THE AUTHOR

...view details