GT vs PBKS IPL 2024 :అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్- పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య జరిగిన పోరులో పంజాబ్ విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. శశాంక్ సింగ్ (61*) తన సంచలన బ్యాటింగ్‌తో పంజాబ్ టీమ్‌కు కీలక ఇన్నింగ్స్ అందించాడు.ఇక ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ (31) కూడా ప్రత్యర్థుల బంతులు ఎదుర్కొని జట్టు విజయంలో భాగమయ్యాడు. స్పిన్నర్ నూర్ అహ్మద్ (2/32) ఆకట్టుకున్నాడు. అయితే నాలుగు మ్యాచ్‌లే ఆడిన టైటాన్స్‌కు ఇది రెండో ఓటమి.
మ్యాచ్ సాగిందిలా :
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఛేదనలో పంజాబ్‌కు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. శిఖర్ ధావన్ (1) స్వల్ప స్కోరుకే పెలివియన్ చేరాడు. మరో ఓపెనర్ జాని బెయిర్‌స్టో (22 పరుగులు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (35 పరుగులు) రాణించారు. ప్రస్తుతం క్రీజులో ఉన్న శశాంక్ సింగ్ (50 పరుగులు), అశుతోష్ శర్మ (16) పోరాడున్నారు.
అంతకుముందు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (89*) భారీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కేన్ విలియమ్సన్ (26 పరుగులు), సాయి సుదర్శన్ (33 పరుగులు, 19 బంతుల్లో), రాహుల్ తెవాటియా (23 పరుగులు) రాణించారు. వృద్ధిమాన్ సాహ (11 పరుగులు) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఇక పంజాబ్ బౌలర్లలో కగిలో రబాడా 2, హర్షల్ పటేల్, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ దక్కించుకున్నారు.
స్కోర్లు
- గుజరాత్- 199/4 (20 ఓవర్లు)
- పంజాబ్- 169/6 (17.4 ఓవర్లు)