Gautam Gambhir IPL :టీమ్ ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తాజాగా ఐపీఎల్ గురించి పలు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సంబంధించిన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆయన మాట్లాడారు. ఐపీఎల్, కాంట్రవర్సీలు, ఇండియన్ క్రికెట్‌పై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
"ఐపీఎల్ వల్ల ఇండియా డొమెస్టిక్ క్రికెటర్లకు మేలు జరిగింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ టీ20 జట్లను చూసినప్పుడు 2-3 జట్లను మినహాయించి , భారత్‌తో పోటీపడే టీమ్‌లు కనిపించడం లేదు. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ కంటే ఐపీఎల్‌లో పోటీ పెరిగింది. అయితే దీనివల్ల డొమెస్టిక్ క్రికెటర్ల క్వాలిటీ మారిపోయింది. అందరూ ఐపీఎల్ ఆడాలని కోరుకుంటున్నారు. టీ20కి తగినట్లు సిద్ధమవుతున్నారు. వారి దృష్టంతా టీ20 క్రికెట్ ఆడటం పైనే ఉంటోంది. ఇప్పుడున్న పెద్ద ఆందోళన ఏంటంటే, టీమ్ ఇండియా తరఫున ఎంత మంది యంగ్ ప్లేయర్స్ టెస్ట్ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారు. టీమ్ ఇండియాకి సెలక్ట్ కావడానికి ఐపీఎల్ షార్ట్‌కట్ కాకూడదని ఆశిస్తున్నాను. వన్డే, టెస్ట్ టీమ్‌లకు సెలక్ట్ అవ్వాలంటే డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించాల్సిందే" అని అన్నాడు.
'నా నవ్వు చూడటానికి రారు'
ఇక ఇదే చిట్‌చాట్ సెషన్లో గంభీర్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తాను ఎందుకు సీరియస్‌గా ఉంటారో వెల్లడించారు.