Bowler Wicket Celebration Style :క్రికెట్‌కి ఒకప్పుడు జెంటిల్‌మెన్ గేమ్ అని పేరుండేది. ఇప్పుడు మైదానంలో ఆటగాళ్లు దూకుడు, సెలబ్రేషన్స్ చూస్తే నిజమేనా? అనే సందేహం రాక మానదు. ఐపీఎల్ లాంటి ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లు వచ్చిన తర్వాత క్రికెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. ప్లేయర్‌లు తమ ప్రదర్శనపైనే కాకుండా ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంపై కూడా దృష్టి పెడుతున్నారు.
ఇందులో భాగంగానే హాఫ్ సెంచరీ, సెంచరీ బాదాక బ్యాటర్లు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వికెట్ తీశాక బౌలర్లు ప్రత్యేక విన్యాసాలు, డ్యాన్స్‌లు చేస్తుంటారు. ఫ్యాన్స్ అందరికీ మెమరబుల్‌గా మారిన ఐదు వికెట్ సెలబ్రేషన్ డ్యాన్స్‌లు ఏవో? ఇప్పుడు చూద్దాం.
డీజే బ్రావో - ఛాంపియన్ డ్యాన్స్
మైదానంలో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునే లిస్ట్ వెస్టిండీస్ దిగ్గజం డీజే బ్రావో పేరుతోనే మొదలవుతుంది. 'ఛాంపియన్' పాటతో పాపులర్ అయిన బ్రావో, వికెట్ తీసిన తర్వాత ఆ సాంగ్ స్టెప్‌లు వేసేవాడు. CLT20 మ్యాచ్ సమయంలో, వేదికపై చీర్‌లీడర్‌లతో కలిసి కూడా వికెట్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. కెరీర్ చివరి వరకు ఫీల్డ్‌లో బ్రావో, ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేశాడు.
క్రిస్ గేల్ గంగ్నమ్ స్టైల్
2010 ప్రారంభంలో క్రిస్ గేల్ క్రికెట్ ప్రపంచానికి గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్‌ని పరిచయం చేశాడు. ఐపీఎల్‌లోనే కాకుండా అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా వికెట్ తీసినప్పుడు ఈ డ్యాన్స్ చేసేవాడు. గేల్‌తోపాటు సహచరులు కూడా స్టెప్‌లు వేయడంతో ఈ స్టైల్ పాపులర్ అయింది.
హర్భజన్ సింగ్ 'భంగమ్' డ్యాన్స్
క్రిస్ గేల్ పరిచయం చేసిన తర్వాత గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ క్రికెట్ సంచలనంగా మారింది. అయితే ఐపీఎల్ 2013లో ఏప్రిల్ 27న వాంఖడేలో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ మరో కొత్త స్టైల్ ఇంట్రడ్యూస్ చేశాడు. 18 పరుగులు చేసిన గేల్‌ను ఔట్ చేసిన తర్వాత, గంగ్నమ్ స్టైల్‌ను భాంగ్రాతో మిక్స్ చేసి హర్బజన్ వినూత్నంగా సంబరాలు చేసుకున్నాడు. ఇది 'భంగమ్ డ్యాన్స్'గా పాపులర్ అయింది. జరిగింది
ఆడమ్ గిల్‌క్రిస్ట్ - (గంగ్నమ్ స్టైల్)
ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ గిల్‌క్రిస్ట్ 2013 ఐపీఎల్‌లో కొత్త రకం గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ చేశాడు. అతడి చివరి ఐపీఎల్ మ్యాచ్‌లో మొదటిసారి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గిల్‌క్రిస్ట్ హర్భజన్ సింగ్ వికెట్ తీసుకోగలిగాడు. మొదటి బాల్‌కే వికెట్ తీసిన గిల్‌క్రిస్ట్, అందరినీ ఆశ్చర్యపరిచేలా, తన స్టైల్‌లో గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ చేశాడు. ఈ వెర్షన్ కూడా ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంది.
కీరన్ పొలార్డ్ డ్యాన్స్
2023లో ఎంఐ న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ మధ్య జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్, కేవలం రెండు పరుగులకే రస్సెల్‌ను ఔట్ చేశాడు. కీలక వికెట్ పడగొట్టిన ఆనందంలో పొలార్డ్ చేసిన డ్యాన్స్ టాప్ ఫైవ్‌లో ఒకటిగా నిలిచింది.
పెర్ఫామెన్స్ ఫుల్, లక్ నిల్ - డొమెస్టిక్‌లో రాణించి సెలక్టర్ల పిలుపు కోసం వెయిట్ చేసిన క్రికెటర్స్ ఎవరంటే? - Domestic Cricket Players In India
టీ10 లీగ్‌లో సంచలనం - 11 బంతుల్లో 66 పరుగులు!