తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫీల్డింగ్‌ మేళవింపుల్లో కొత్త ప్రయోగాలు - ఇదే టెస్ట్ క్రికెట్​ నయా సక్సెస్​ మంత్ర! - టెస్ట్ క్రికెట్ ఫీల్డింగ్ సెటప్​

Fielding Setup In Test Cricket : మరో రెండు రోజుల్లో భారత్​, ఇంగ్లాండ్ మధ్య ఐదు రోజుల టెస్ట్ సిరీస్​ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్​కు చేరుకున్నాయి. ప్రాక్టీస్​ను సైతం మొదలెట్టాయి. అయితే టెస్ట్ క్రికెట్​ అంటే అందరికీ ఇప్పుడు ఆట కంటే ఆ ఫీల్డింగ్ పొజిషన్స్​పై ఆసక్తి నెలకొంది. గత కొంత కాలంగా జట్టు సక్సెస్​లో ఇది కీలకంగా మారింది. ఇంతకీ ఈ ఫీల్డింగ్ పొజిషన్స్ ఎంటంటే ?​

Fielding Setup In Test Cricket
Fielding Setup In Test Cricket

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 11:10 AM IST

Updated : Jan 23, 2024, 11:22 AM IST

Fielding Setup In Test Cricket : అది 2023 యాషెస్‌ టెస్ట్​. ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్‌ ఖవాజా మైదావనంలో ఉన్నాడు.అతడికి ఫీల్డింగ్‌ పెట్టిన విధానాన్ని చూస్తే ఎవరైనా టెయిలెండర్‌ ఆడుతున్నాడా అన్నట్లు ఉంది. నాన్‌ స్ట్రెకర్‌కు అటు ఇటు ముగ్గురు ఫీల్డర్లు ఉన్నారు. ఈ ఫీల్డ్‌ సెటప్‌ చూసిన ఉస్మాన్​ షాట్​ ఆడబోయి బౌల్డయ్యాడు. అతడి కాన్సన్​ట్రేషన్​ చెదరడానికి కారణం ఆ కొత్త ఫీల్డింగే! టెస్టుల్లో కొత్త ఫీల్డింగ్‌ కాంబినేషన్​కు ఇది ఓ మంచి ఉదాహరణ.

సాధారణంగా టెస్ట్​ మ్యాచుల్లో ఫీల్డింగ్‌ గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. ఈ సుదీర్ఘ ఫార్మాట్లో ఎక్కువగా బ్యాటింగ్, బౌలింగ్‌పైనే అందరి దృష్టి ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో టెస్టుల్లో భిన్నమైన ఫీల్డింగ్‌ కాంబినేషన్​లు క్రికెట్​ లవర్స్​లో ఆసక్తిని రేపుతున్నాయి. కొత్త ప్రయోగాలు చేస్తున్న టీమ్స్​ అభిమానులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియా-పాకిస్థాన్, వెస్టిండీస్‌-పాకిస్థాన్‌ సిరీస్‌లు కూడా ఇలాంటి కొత్త పంథాకు తెర తీశాయి.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ టీమ్​ కూడా ఓ కొత్త ప్రయోగం చేసింది. ఆసీస్‌ టాప్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను ట్రాప్ చేసేందుకు భిన్నమైన ఫీల్డింగ్‌ సెటప్‌ను ప్రయత్నించింది. సాధారణంగా స్మిత్‌కు ఆఫ్‌ సైడ్‌లో కవర్స్, పాయింట్‌ దిశగా ఆడటం అలవాటు. అంతే కాకుండా అతడి బ్యాట్‌ ఎప్పుడు కూడా ఆ దిశగానే స్వేచ్ఛగా కదులుతూ ఉంటుంది. దీంతో స్మిత్‌ ఎక్కువగా పాయింట్, కవర్స్‌ స్థానాల్లో ఆడే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పాక్‌ జట్టు ముగ్గురు ఫీల్డర్లను కవర్స్, పాయింట్‌ పొజిషన్స్‌లో పెట్టింది. అలా స్మిత్‌ను బ్లాక్‌ చేసింది. దీంతో తనకు అలవాటైన రీతిలో ఓ డ్రైవ్‌కు వెళ్లిన స్మిత్​ షార్ట్‌ కవర్స్‌లో ఫీల్డర్‌కి దొరికిపోయాడు.

వెస్టిండీస్​ కూడా ఇలాగే : ట్రెడిషనల్ ఫీల్డింగ్​కు ఓటేసే వెస్టిండీస్‌ జట్టు కూడా ఇటీవలే ఈ ఫీల్డింగ్​ ప్లాన్​ను అమలు చేసింది. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో షార్ట్‌ స్లిప్‌ ఫీల్డర్‌ని పెట్టి ఓ కొత్త ప్రయోగాన్ని చేసింది. సాధారణంగా ఫార్వర్డ్‌ షార్ట్‌ లెగ్, షార్ట్‌ లెగ్‌లో ఫీల్డర్లను బ్యాటర్లకు దగ్గరగా మొహరిస్తారు. అయితే విండీస్‌ మాత్రం హెల్మెట్‌ పెట్టుకున్న ఓ ఫీల్డర్‌ని థర్డ్‌ స్లిప్, గల్లీకి కాస్త ముందుగా పెట్టింది. దీన్ని షార్ట్‌ థర్డ్‌ స్లిప్‌ అనుకోవచ్చు. ఈసారి కూడా కొత్త ఫీల్డింగ్‌ సెటప్‌కు దొరికింది ఎవరో కాదు స్మితే. తన శైలిలో డ్రైవ్‌ ఆడే ప్రయత్నం చేసిన స్మిత్‌ ఈ షార్ట్‌ స్లిప్‌ ఫీల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

అంబ్రెల్లా ఫీల్డింగ్‌ : సాధారణంగా మ్యాచ్‌లో కొన్ని ఓవర్లలో రిజల్ట్​ డిక్లేర్​ అయ్యే అవకాశం ఉన్నప్పుడో లేక చివరి వరుస బ్యాటర్లను ఔట్‌ చేయడానికో టెస్టుల్లో అంబ్రెల్లా ఫీల్డింగ్​ను పెడుతుంటారు. కానీ గత యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ పెట్టిన ఫీల్డింగ్‌ మాత్రం ఇంకా భిన్నమైందిగా అనిపించింది. టాప్‌ బ్యాటర్‌కి వల వేసినట్లుగానే షార్ట్‌ మిడాన్, షార్ట్‌ కవర్స్‌, షార్ట్‌ మిడాఫ్ ఇలా అన్ని సమీప ప్రదేశాలను కవర్‌ చేస్తూ ఫీల్డర్లను పెట్టి ఖవాజాను బుట్టలో వేశాడు ఈ స్టార్ క్రికెటర్. సాధారణంగా ఖవాజా డ్రైవ్‌లతో పరుగులు చేస్తాడు. అయితే ఎదురుగా అటు ముగ్గురు ఇటు ముగ్గురు ఫీల్డర్లు ఉండటం వల్ల అతడికి రన్స్​ స్కోర్​ చేసే అవకాశం దక్కలేదు. దీంతో ఓ చెత్త షాట్‌కు పోయి బౌల్డ్‌ అయ్యాడు.

Last Updated : Jan 23, 2024, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details