తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ పేసర్లు యమ స్పీడు- బంతి విసిరితే 150+kmph పక్కా!- IPLలో టాప్ 5 ఫాస్టెస్ట్ బాల్స్ - Fastest Ball In IPL

Fastest Ball In IPL: సమ్మరీ: ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్‌లతో ఆధిప్యతమని చాలా మంది చెబుతుంటారు. కానీ బౌలర్లు తమదైన రోజు నిప్పులు చెరిగే బంతులతో మ్యాచ్‌ గతినే మార్చేయగలరు. ప్రస్తుత ఐపీఎల్​ టోర్నీలో 150+ స్పీడ్‌ బౌలింగ్‌తో యంగ్‌ స్పీడ్‌స్టర్‌లు మయాంక్‌, గెరాల్డ్ రుజువు చేశారు. మరి ఇంతకీ ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ బాల్‌ని డెలివరీ చేసింది ఎవరో తెలుసా?

Fastest Ball In IPL
Fastest Ball In IPL

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 9:13 PM IST

Updated : Apr 3, 2024, 7:47 AM IST

Fastest Ball In IPL:ఐపీఎల్‌ 2024 సీజన్‌లో 14 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రతిరోజూ మ్యాచ్‌ విన్నింగ్‌ పెర్ఫార్మెన్స్‌ కనబర్చిన ప్లేయర్స్‌ గురించి అందరూ చర్చించుకోవడం మామూలే. కానీ అరంగేట్రం మ్యాచ్‌తోనే అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు గెరాల్డ్ కాట్జీ, మయాంక్‌ యాదవ్‌. ఈ పేస్ బౌలర్లు ప్రస్తుత సీజన్​లోనే కాదు, ఆల్​టైమ్ ఐపీఎల్​లో వేగవంతమైన బంతులు సంధించి రికార్డుల్లో నిలిచారు. దీంతో ఇప్పుడు ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన డెలివరీ గురించే చర్చలు నడుస్తున్నాయి. మరి ఐపీఎల్​ చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్ డెలివరీలు ఎవో తెలుసుకుందాం.

  • షాన్ టైట్ (157.71 kmph):ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా బాల్‌ డెలివరీ చేసిన రికార్డు షాన్ టైట్ పేరిట ఉంది. 2011లో షాన్‌ టైట్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కి ఆడాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను వేసిన ఓ బాల్‌ 157.71 kmph స్పీడ్‌తో దూసుకెళ్లింది.
  • గెరాల్డ్ కాట్జీ (157.4kmph): ముంబయి పేసర్ గెరాల్డ్ కాట్జీ 2024లోనే అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. రీసెంట్​గా రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో గెరాల్డ్ వేసిన ఓ బంతి ఏకంగా 157.4kmph తో దూసుకెళ్లింది. దీంతో ప్రస్తుత సీజన్​లో ఫాస్టెస్ట్ డెలివరీగా రికార్డు సాధించాడు గెరాల్డ్. ఇక ఓవరాల్​గా గెరాల్డ్ రెండో స్థానంలో ఉన్నాడు.
  • లాకీ ఫెర్గూసన్(157.3 kmph):ఐపీఎల్ 2022లో, గుజరాత్ టైటాన్స్‌కు చెందిన లాకీ ఫెర్గూసన్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వేగవంతమైన బాల్‌ రికార్డు అందుకున్నాడు. మ్యాచ్‌లో 157.3 kmph వేగంతో ఆ సీజన్‌లోనే వేగవంతమైన బంతిని బౌల్ చేశాడు. టోర్నమెంట్‌లో వేగవంతమైన డెలివరీకి ప్రైజ్‌ కూడా లభించింది.
  • ఉమ్రాన్ మాలిక్( 157.0 kmph):ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అత్యంత వేగవంతమైన బాల్ సంధించాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 157.0 kmph వేగంతో బాల్‌ డెలివరీ చేశాడు.
  • అన్రిచ్ నోకియా (156.22kmph):అన్రిచ్‌ నోకియా దిల్లీ క్యాపిటల్స్‌కి ఆడుతున్నాడు. IPL 2020లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 156.22 kmph స్పీడ్‌తో బాల్‌ వేశాడు. ఈ టోర్నీలో దిల్లీ ఫైనల్‌కి చేరింది.
  • మయాంక్ యాదవ్ (155.8 kmph):ఐపీఎల్‌ 2024లో అన్‌క్యాప్డ్ ఇండియన్ బౌలర్ మయాంక్ యాదవ్ లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌కి ఆడుతున్నాడు. మార్చి 30న పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో మయాంక్‌ యాదవ్‌ అత్యధికంగా 155.8 kmph స్పీడ్‌తో ఓ బాల్‌ డెలివరీ చేశాడు.
Last Updated : Apr 3, 2024, 7:47 AM IST

ABOUT THE AUTHOR

...view details